
సీఎం నివాసం ముట్టడికి విఫలయత్నం
భువనేశ్వర్: దివంగత బొలొంగా బాలిక, ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాల విద్యార్థిని, ధర్మశాల ఎమ్మెల్యే అత్యాచారానికి గురైన మహిళా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర యువజన కాంగ్రెస్ సోమవారం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నివాసాన్ని చుట్టుముట్టింది. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రంజిత్ పాత్రో నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో పోలీసులతో ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు పలువురు యువజన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రంజిత్ పాత్రో మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒడిశా మహిళలకు న్యాయం అందించడంలో విఫలమైందన్నారు. రాష్ట్రంలో రోజుకు సగటున 15 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని, మోహన్ చరణ్ మాఝీ సర్కార్ అత్యాచారం కేసులను అణగదొక్కి నిందితులకు అండగా నిలుస్తుందని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా సృష్టించిన అభూత కల్పన ఆధారంగా కథనంపై పోలీసులు, దర్యాప్తు సంస్థ నివేదికను రూపొందిస్తున్నారని ఆరోపించారు.