
న్యాయం చేస్తారా.. చనిపోమంటారా?
టెక్కలి రూరల్: తనకు, పిల్లలకు న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ శుక్రవారం ఓ మహిళ పురుగుల మందుతో టెక్కలి పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించింది. గతంలో తన భర్తతో తగాదా ఉంటే పోలీసులు కోర్టులో రాజీ చేయించి తమను బాగా చూసుకుంటాడని చెప్పారని, తర్వాత పూర్తిగా పట్టించుకోవడం మానేశాడని వాపోయింది. తనకు న్యాయం జరగకపోతే చావే శరణ్యమన్నారు. దీంతో పోలీసులు ఆమెకు నచ్చజెప్పి పురుగు మందు బాటిల్‌ను తీసుకుని స్టేషన్‌లోకి తీసుకువెళ్లి మాట్లాడారు. భర్తను పిలిపించి తనకు న్యాయం చేస్తామని ఎస్‌ఐ రాము నచ్చజెప్పి అక్కడ నుంచి పంపించారు. కాగా, స్టేషన్ వద్ద మహిళ బైఠాయించిందన్న విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు స్టేషన్‌కు చేరుకుని వివరాలు సేకరించే క్రమంలో పోలీసులు అడ్డుతగిలారు. ఫొటోలు తీయడానికి వీలు లేదంటూ పంపించేశారు.
పురుగుమందు బాటిల్‌తో మహిళ నిరసన
టెక్కలి పోలీస్‌స్టేషన్ ఎదుట కలకలం