రేపు జిల్లాస్థాయి యోగా పోటీలు | - | Sakshi
Sakshi News home page

రేపు జిల్లాస్థాయి యోగా పోటీలు

Aug 2 2025 6:46 AM | Updated on Aug 2 2025 6:46 AM

రేపు

రేపు జిల్లాస్థాయి యోగా పోటీలు

నరసన్నపేట: నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ నెల 3న జిల్లా యోగాసనా చాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు వివేకానంద ధ్యాన యోగా సమితి అధ్యక్షుడు కింజరాపు రామారావు తెలిపారు. యోగాసన స్పోర్ట్‌ అసోషియేషన్‌ శ్రీకాకుళం ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. దీనిలో భాగంగా అభ్యాసకులకు ఇచ్చే టీషర్టులను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ , ఎన్‌వైఎస్‌ఎఫ్‌ కార్యదర్శి బోత్స కేదారినాథ్‌ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఉదయం 7 కల్లా సభా ప్రాంగణానికి చేరుకోవాలని కోరారు.

బాక్సర్‌కు అభినందనలు

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన యువ బాక్సింగ్‌ సంచలనం జి.సత్యభార్గవ్‌ను డీఎస్‌డీఓ డాక్టర్‌ కె.శ్రీధర్‌రావు అభినందించారు. శుక్రవారం కోడిరామ్మూర్తి స్టేడియం వద్ద శిక్షణకు హాజరైన సత్యభార్గవ్‌ను, తీర్చిదిద్దుతున్న కోచ్‌ పి.ఉమామహేశ్వరరావును మెచ్చుకున్నారు. హర్యానాలోని రోతక్‌ వేదికగా జరిగిన ఆలిండియా జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో ఈ యువ బాక్సర్‌ రజత పతకంతో మెరిసిన విషయం తెలిసిందే. దీంతో ఇండియన్‌ కోచింగ్‌ క్యాంప్‌కు ఎంపికయ్యాడు. త్వరలో శిక్షణా శిబిరాలకు హాజరుకానున్నట్టు కోచ్‌ తెలిపారు.

బోటు బోల్తాపడి మత్స్యకారుడు మృతి

గోవాలో ఘటన

వజ్రపుకొత్తూరు: పల్లివూరు పంచాయతీ హుకుంపేటకు చెందిన మత్స్యకారుడు కారి రాజులు(44) గోవాలో శుక్రవారం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజులు స్థానికంగా వేట సాగకపోవడంతో గోవాకు వలసవెళ్లాడు. అక్కడ శుక్రవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో వేట సాగిస్తుండగా అలల ధాటికి బోటు బోల్తా పడింది. బోటు కిందే రాజులు చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. రాజులు తల్లిదండ్రులు బాల్యంలోనే చనిపోగా, భార్య నాగమ్మ, ఇద్దరు కుమార్తెలు స్వాతి, స్వప్న ఉన్నారు. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోవా పోలీసులు పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని గ్రామానికి పంపిస్తారని స్థానికులు తెలిపారు.

7న ప్రతిభా పోటీలు

ఎచ్చెర్ల : శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 వసంతాలు పూర్తికావస్తున్న సందర్భంగా పీజీ, డిగ్రీ విద్యార్థులకు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం జర్నలిజం మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 7న ప్రత్యేక ప్రతిభా పోటీ నిర్వహిస్తున్నట్లు వర్శిటీ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.అనూరాధ శుక్రవారం తెలిపారు. జిల్లా చరిత్ర, సంస్కృతి, స్వాతంత్య్ర ఉద్యమంలో జిల్లా పాత్ర, జిల్లా ప్రగతిలో ముఖ్య ఘట్టాలు, జిల్లాలో జన్మించిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తదితర అంశాలపై విద్యార్థులు సమాధానాలు రాయాల్సి ఉంటుందన్నారు. వర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల డిగ్రీ విద్యార్థులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 83095 19615 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

రేపు జిల్లాస్థాయి యోగా పోటీలు 1
1/2

రేపు జిల్లాస్థాయి యోగా పోటీలు

రేపు జిల్లాస్థాయి యోగా పోటీలు 2
2/2

రేపు జిల్లాస్థాయి యోగా పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement