
చెలిగడ రిజర్వాయర్ సందర్శన
పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్ చెలిగడ జలవిద్యుత్ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ మధుమిత శుక్రవారం అధికారులతో సందర్శించారు. తొలుత కలెక్టర్ మధుమిత కువాపడ, ముషాడోల్లి గ్రామానికి వెళ్లి ఛెలిగడ రిజర్వాయర్ ప్రాజెక్టు అంతర్గత నిర్మాణాలు, టన్నెల్‌ను సందర్శించారు. అనంతరం చెలిగడ గ్రామంలో ఎడమవైపు నిర్మాణంలో ఉన్న డ్యాం, బోడోజోరో నదిని సందర్శించారు. తర్వాత ఛెలిగడ రిజర్వాయర్ వల్ల ముంపునకు గురైన పులుసుగుబ్బ నిర్వాసితుల కాలనీని పరిశీలించి వాటి పనులు వెంటనే పూర్తిచేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. పులుసుగుబ్బ వద్ద నిర్వాసితుల కాలనీ వద్ద ప్రభుత్వ పాఠశాల, తాగునీరు, విద్యుత్ సౌకర్యంపై అధికారులతో అక్కడ సమీక్షించారు. కలెక్టర్ మధుమిత పర్యటనలో చెలిగడ రిజార్వాయర్‌కు భూసేకరణ, పునరావాస అధికారి రవీంద్ర నాథ్ కుహోరో, ఛెలిగడ జలవిద్యుత్ ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజినీరు బీరేంద్ర కుమార్ జగత్, ఆర్.ఉదయగిరి తహసీల్దార్ జ్యోతి మయ దాస్, మండల అధికారి శుభాషిష్ పండా, లోకనాథ బెహరా, ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు లక్ష్మీ చరణ్ మిశ్రా, ఏఈ జయంత్ నాయక్, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం చెలిగడ గ్రామం వద్ద నిర్వాసిత కుటుంబ ప్రజలతో కలెక్టర్ మధుమిత మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెలిగడ రిజర్వాయర్‌ను వీలైంనంత తొందరలో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

చెలిగడ రిజర్వాయర్ సందర్శన