
లక్ష్మీనృసింహునికి శ్రావణ మాస పూజలు
రాయగడ: కొలనార సమితి పరిధిలో గల అమలాభట్ట సమీపంలో ఉన్న శ్రీక్షేత్ర టౌన్‌షిప్‌లో కొలువై ఉన్న లక్ష్మీనృసింహుని ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక పూజలను గురువారం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మంగనాథ్ ఆచార్యుల ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, అభిషేకాలు స్వామికి నిర్వహించారు. అదేవిధంగా సకల కార్యాలు జయం చేసే శ్రీసుదర్శన ఆల్వార్ తిరునక్షత్రం సందర్భంగా సుదర్శనుడికి విశేష పూజలను నిర్వహించారు. సాయంత్రం స్వామికి అష్టొత్తర శతనామ అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్ దంపతులు ఈ సందర్భంగా ప్రత్యేక పూజాకార్యక్రమాలను నిర్వహించారు.

లక్ష్మీనృసింహునికి శ్రావణ మాస పూజలు