
కొట్‌పాడ్ కమ్యూనిటీ హెల్త్ కేంద్రంలో ఆల్ట్రా సౌండ్ ప
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ కమ్యూనిటీ ఆస్పత్రిలో ఆల్ట్రాసౌండ్ యంత్రాన్ని కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర గురువారం ప్రారంభోత్సవం చేశారు. అలాగే ఆస్పత్రిలో రోగుల కోసం రక్షిత తాగునీటి పథకాన్ని కూడా ప్రారంభించారు. కొట్‌పాడ్ కమ్యూనిటీ హాస్పిటల్ అధికారి డాక్టర్ సారదా ప్రశాద ముని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆల్ట్రాసౌండ్ యంత్రం ఏర్పాటు వల్ల కొట్‌పాడ్ సమితి, పట్టణ ప్రజలు, ముఖ్యంగా గర్భిణులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి గురువారం వైద్య నిపుణులు వచ్చి కొట్‌పాడ్ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.