
కొబ్బరితో విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు
రాయగడ: స్థానిక బుదరావలసలో ప్రతీ ఏడాది మాదిరిగా ఈసారి కూడా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మూడేళ్లుగా ఇక్కడ బుదరావలస యువజన సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోనే అత్యంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ గుర్తింపు పొందుతున్నారు. అయితే ఈ ఏడాది వినూత్నంగా వినాయక విగ్రహం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు గురువారం ముహూర్తపు రాటను వేశారు. సుమారు 2001 కొబ్బరికాయలతో 25 అడుగల వినాయక విగ్రహాన్ని రూపొందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.