
ఘనంగా సఖీ వన్‌స్టాప్ సెంటర్ వార్షికోత్సవం
పర్లాకిమిడి:
స్థానిక టౌన్ హాల్‌లో గురువారం సాయంత్రం వన్ స్టాప్ సెంటర్ (సఖీ), ఐ.ఎస్.ఆర్.డి 6వ వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో సబ్ కలెక్టర్ అనుప్‌పండా, ఐ.ఎస్.ఆర్.డి డైరెక్టర్ సుధీర్ సాబత్, ప్రోగ్రాం ఆఫీసర్ సరలా పాత్రో, జిల్లా సాంస్కృతిక అధికారిని అర్చనా మంగరాజ్, డి.సి.పి.యు అరుణ్ కుమార్ త్రిపాఠి, సి.డబ్ల్యూ.సి చైర్మన్ అశ్వినీ కుమార్‌మహాపాత్రో, పురపాలక చైర్మన్ నిర్మలా శెఠి తదితరులు పాల్గొన్నారు. గృహాహింస, మహిళలపై అసభ్యప్రవర్తన, విద్యార్థులపై లైంగిక వేధింపులు వంటివి జరగకుండా గట్టి చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా అన్నారు. సఖీ వన్‌స్టాప్ సెంటర్ వార్షిక వేడుకలు సందర్భంగా ఎస్పీ సతీమణి కేక్ కట్ చేసి మహిళలు, విద్యార్థులకు తినిపించారు. అనంతరం స్థానిక కళాకారులతో సంబల్‌పురి, ఒడిస్సీ నృత్యాలను ప్రదర్శించారు. విద్యార్థులకు ప్రశంపాపత్రాలు, షీల్డులు అందజేశారు.
సఖీ వన్‌స్టాప్ సెంటర్ వేడుకలకు విచ్చేసిన మహిళలు, విద్యార్థులు