
సమితి చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పరిధి గుడారి సమితిలో రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. రాజకీయాల్లో అత్యంత ప్రధాన్యత సంతరించుకున్న ఈ సమితిలో ఈనెల 24వ తేదీన సమితి చైర్‌పర్సన్‌గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీ సొబొరొకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం అవిశ్వాస తీర్మానానికి సంబంధించి తేదీ ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సమితి సభ్యులు, సర్పంచ్‌లు, గుణుపూర్ ఎమ్మెల్యే, చైర్మన్, వైస్ చైర్మన్లు హాజరవ్వాలని కోరారు. గత నెలలో సమితి వైస్ చైర్మన్ విశ్వనాథ్ సొబొరొ నేతృత్వంలో 14 మంది సభ్యులు చైర్మన్ లక్ష్మీపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం దాఖలు చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం తేదీ ఖరారు చేశారు. అయితే ఈ సమితిలో 18 మంది సమితి సభ్యులు, సర్పంచ్‌లు ఉన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 20 ఓట్లు ఉన్నాయి.