జాతీయ స్థాయిలో డెర్మటాలజీ పీజీల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయిలో డెర్మటాలజీ పీజీల ప్రతిభ

Jul 28 2026 5:11 AM | Updated on Jul 28 2026 5:11 AM

జాతీయ స్థాయిలో డెర్మటాలజీ పీజీల ప్రతిభ విద్యార్థుల సామర్థ్యాల పెంపుపై దృష్టి డైట్‌లో 41మంది చేరిక 6 నుంచి రాష్ట్ర స్థాయి నృత్య పోటీలు

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల డెర్మటాలజీ విభాగం పోస్టుగ్రాడ్యుయేట్‌ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఈ నెల 24 నుంచి 26 వరకూ పుదుచ్చేరిలో జరిగిన చిన్నపిల్లల చర్మవ్యాధులపై జాతీయ స్థాయి సమావేశంలో ఆ కళాశాల పీజీలు డాక్టర్‌ నేహా, అపర్ణ, ప్రజీత్‌ సమర్పించిన పరిశోధనా పత్రాలు ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచాయి. విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచిన డెర్మటాలజీ హెచ్‌ఓడీ డాక్టర్‌ వాణితో పాటు, పీజీ విద్యార్థులను సోమవారం ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆలపాటి ఏడుకొండలరావు, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘునందన్‌ అభినందనలు తెలిపారు.

కంకిపాడు: విద్యార్థుల సామర్థ్యాల పెంపుపై దృష్టి సారించాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ సూచించారు. మండలంలోని పునాదిపాడు జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పాఠశాల పనితీరు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, పదో తరగతి ఫలితాలపై సమీక్ష చేసి సూచనలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, ఫార్మాటివ్‌, సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవన్నారు. పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు, ఉపాధ్యాయుల శ్రమకు తగిన ఫలితాలు కనిపించటం లేదన్నారు. కారణాలు గుర్తించి సరిదిద్దే ప్రయత్నాలు చేపట్టాలన్నారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతో కలిసి చేసి నాణ్యత తనిఖీ చేశారు. విద్యాశాఖ ఆర్‌జేడీ జి.నాగమణి, డీఈఓ యూవీ సుబ్బారావు, హెచ్‌ఎం ఏ.వెంకటేశ్వరరావు, డీవైఈఓ పద్మారాణి తదితరులు పాల్గొన్నారు.

గుడ్లవల్లేరు: మండలంలోని అంగలూరు ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ(డైట్‌)లోని డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సులో 41మంది చేరినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రలేఖ తెలిపారు. అలాగే ఏజే కాలేజ్‌ మచిలీపట్నంలో ఏడుగురు కలిపి మొత్తం మీద సోమవారానికి 48మంది అడ్మిషన్లు పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలించామన్నారు. లెక్చరర్లు డాక్టర్‌ పి.వినయకుమార్‌, ప్రకాశం, రాజ్యలక్ష్మి, జూనియర్‌ అసిస్టెంట్స్‌ శ్రీనివాస్‌, దివ్యశ్రీ, ఆఫీస్‌ సిబ్బంది శేఖర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): శైవ క్షేత్ర పీఠాధిపతులు శివస్వామి దివ్య ఆశీస్సులతో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్‌, ధర్మో రక్షతి రక్షితః ట్రస్ట్‌, శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్ర వారి సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లోని కళాకారులను ప్రోత్సహించేందుకు కళా ఉత్సవ్‌ పేరిట రాష్ట్ర స్థాయి నృత్య పోటీలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్‌ చైర్మన్‌ దాసరి శ్రీనివాసులు తెలిపారు. ఈ పోటీలు ఆగస్టు 6, 7, 9 తేదీల్లో స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతాయన్నారు. సోమ వారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో పోటీలకు సంబంఽధించిన పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజులు పాటు జరిగే పోటీలకు సుమారుగా 250 మంది కళాకారులు హాజరై తమ ప్రతిభను చాటుకుంటారన్నారు. పోటీల చివరి రోజైన 9వ తేదీన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుందన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్‌ స్టేట్‌ కల్చరల్‌ కోఆర్డినేటర్‌ నారాయణ, స్టేట్‌ కోఆర్డినేటర్‌ సందిరెడ్డి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement