రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): భీమవరంలో ఈ నెల 20న జరిగిన ఆల్ ఇండియా ఒపెన్ టెన్నిస్ టోర్నీలో రైల్వే ఉద్యోగులు సత్తాచాటారు. 45 ప్లస్ విభాగంలో రైల్వే ఉద్యోగులు కె.రాజేంద్ర ప్రసాద్, సంపత్‌కుమార్ డబుల్స్‌లో విజేతలుగా నిలిచారు. కె.రాజేంద్రప్రసాద్ రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యూనల్‌లో అదనపు రిజిస్ట్రార్‌గా, సంపత్‌కుమార్ ఎలక్ట్రికల్ విభాగంలో టెక్నీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. టోర్నీ అంతటా అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తూ ఫైనల్‌లో తెలంగాణ రాష్ట్రం, ఖమ్మంనకు చెందిన గంజి వెంకటేశ్వర్లు, భాస్కర్‌పై గెలుపొంది టైటిల్ సాధించారు.


