ఆర్థిక ఇబ్బందులతో పండ్ల వ్యాపారి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో పండ్ల వ్యాపారి ఆత్మహత్య

Mar 22 2026 2:10 AM | Updated on Mar 22 2026 2:10 AM

గన్నవరం: ఆర్థిక ఇబ్బందులు, క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారంలో పోలీసుల వేధింపులను తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గన్నవరంలోని గాజులపేటలో నివసించే పడమట నాగరాజు దావాజిగూడెం రోడ్డులో పండ్ల దుకాణం నడుపుతున్నాడు. ఐదేళ్ల క్రితం సమీప బంధువు ఓ ఫైనాన్స్‌ సంస్థలో తీసుకున్న రుణానికి నాగరాజు ష్యూరిటీ సంతాకం చేశాడు. ఆ బంధువు రుణం తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్స్‌ సంస్థ ప్రతినిధులు అప్పు చెల్లించాలని నాగరాజును వేధిస్తున్నారు. అంతే కాకుండా తాడేపల్లికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి నాగరాజు ద్వారా ఓ బుకి వద్ద క్రికెట్‌ బెట్టింగ్‌లు వేసి రూ.5 లక్షలు నష్టపోయారు. ఈ వ్యవహారం పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో ఆ రూ.5 లక్షలకు నాగరాజును బాధ్యుడిని చేసి తిరిగి చెల్లించాలని పోలీసులు ఒత్తిడి చేశారు. ఈ విషయమై నాగరాజును స్టేషన్‌కు పిలిపించి గట్టిగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన నాగరాజు గుంటూరు సమీపంలోని పొలాల్లో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు అతనిని గుంటూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మృతి చెందాడు. ఫైనాన్స్‌ సంస్థతో పాటు పోలీసులు వేధింపుల కారణంగానే నాగరాజు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. నాగరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement