లబ్బీపేట(విజయవాడతూర్పు): రాకాస ఒక అద్భుతమైన కామెడీ ఫాంటసీ చిత్రమని, ఇందులో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని హీరో సంగీత్ శోభన్ పేర్కొన్నారు. ఏప్రిల్ మూడో తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు శనివారం విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ఓ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ తనకు బాగా నచ్చిందన్నారు. నిహారిక ప్రొడక్షన్‌లో ఇది తన రెండో సినిమా అని, కుటుంబ సమేతంగా చూడదగ్గ కామెడీ థ్రిల్లర్ ఎంటర్‌ట్రైనర్‌గా ఉంటుందని వివరించారు. హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ.. తన పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చుతుందన్నారు. చిత్ర నిర్మాత నిహారిక మాట్లాడుతూ.. విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందని, ఇక్కడి నుంచే తమ సినిమా ప్రమోషన్ మొదలుపెట్టామని అన్నారు. రాకాస చిత్రంలోని ప్రతి పాత్రా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వి స్తుందన్నారు. ఈ సమావేశంలో కమెడియణ్ గెటప్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.


