నవాబుపేట సొసైటీ అధ్యక్షుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

నవాబుపేట సొసైటీ అధ్యక్షుడి ఆత్మహత్య

Mar 22 2026 2:09 AM | Updated on Mar 22 2026 2:09 AM

పెనుగంచిప్రోలు: మండలంలోని నవాబుపేట గ్రామ సొసైటీ అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు చింతా వెంకటేశ్వరరావు (బుల్లియ్య) (53) ఆత్మ హత్య చేసుకున్న ఘటన శనివారం తెల్లవారు జామున జరిగింది. తన ఇంటి ముందు రేకుల షెడ్డులో ఉరికి వేలాడుతున్న వెంకటేశ్వర రావును కుటుంబ సభ్యులతో పాటు చుట్టు పక్కల వారు చూసే సరికి మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలంగా తన తండ్రి మానసిక వేదనకు గురవుతున్నారని, ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున మృతి చెంది ఉండటాన్ని గమనించామని వెంకటేశ్వరరావు కుమారుడు రవి ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ అర్జున్‌ తెలిపారు. వెంకటేశ్వరరావు గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు గింజుపల్లి వీరయ్య హత్య కేసులో, ఆయన కుమారుడు శ్రీనివాసరావుపై జరిగిన దాడి ఘటనలో ప్రధాన నిందితుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement