చరిత్రలో ఇదే మొదటిసారి..
వసూళ్ల ‘వాణిజ్యం’లో వీరిదే హవా చరిత్రలో ఇదే మొదటిసారి.. వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖలో అటెండర్లే బిగ్‌బాస్‌లుగా చెలామణి అవుతున్నారు. ఆ శాఖలో అధికారుల కన్నా అటెండర్లే చక్రం తిప్పుతూ అక్రమ వసూళ్లలో ఆరితేరిపోయారంటూ వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ సర్కిల్ కార్యాలయాల్లో అటెండర్లదే హవా అంటూ పలువురు ఆ శాఖ ఉద్యోగులే గుసగుసలాడుతున్నారు. ఇటీవల ఆ శాఖకు చెందిన ఓ అటెండర్‌పై రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసి అరెస్ట్ చేయటం మొత్తం వాణిజ్య పన్నుల శాఖలో సంచలనం సృష్టించింది. అయితే అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన కొండపల్లి శ్రీనివాసరావులాంటి అటెండర్లు చాలా మంది అదే తీరులో అవినీతి దందా కొనసాగిస్తున్నారంటూ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి నగరంలోని ఒక సర్కిల్ కార్యాలయంలో పని చేసే మహిళా అటెండర్ తన కుటుంబ సభ్యులను అధికారులుగా చూపించి వ్యాపారుల నుంచి భారీగా వసూళ్ల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ మహిళా అటెండర్ తన కుటుంబ సభ్యులను కారులో కూర్చోపెట్టి దుకాణాల్లోకి వెళ్లి దందా చేస్తారు. ‘మా మేడమ్ గారు వచ్చారు, వారికి ఆ వస్తువులు కావాలి, అలాగే ముడుపులు తీసుకు రమ్మన్నారు..’ అంటూ వసూళ్లకు పాల్పడుతున్న తీరు విస్మయానికి గురి చేస్తుంది. ఆమెను ఒక్కసారి సస్పెండ్ చేసినా ఆమె తీరు మారలేదంటూ ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు.
వాణిజ్య పన్నుల శాఖలో సిటీవో వంటి కొంతమంది అధికారులు వ్యాపారుల నుంచి ముడుపులు తీసుకోవటానికి అటెండర్లనే వినియోగిస్తుంటారు. వ్యాపారుల వద్ద సీటీవోకు మద్దతుగా బేరం పెట్టి వారికి కావాల్సిన ముడుపులు తీసుకొస్తుంటారు. అయితే ఈ విధమైన చర్యలను అటెండర్లకు అవకాశాలుగా మలచుకుంటున్నారు. అధికారులు చెప్పినా, చెప్పకపోయినా వ్యాపారుల నుంచి తమకు కావాల్సిన లంచాలను ఏదో పేరుతో బెదిరించి తీసుకుంటున్నారని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా కొంతమంది అటెండర్లు రోడ్డుపై నిలబడి వచ్చిపోయే వాహనాలను ఆపి బెదిరించి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితులు సైతం కోకొల్లలుగా ఉన్నాయని ఉద్యోగులే చెబుతున్నారు.
వాణిజ్య పన్నుల శాఖలో అటెండర్లుగా పని చేస్తున్న సిబ్బందికి బదిలీలు లేకపోవటం సైతం వారిలో అవినీతి పెరగటానికి ఒక కారణమని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ప్రధానంగా సస్పెండ్ అయిన అటెండర్లు మినహా ఎక్కడా అటెండర్లు ఆ డివిజన్ పరిధిలో మినహా బయటకు బదిలీ అయ్యే అవకాశం లేదు. ఒక్కొక్కరు పది నుంచి 20 ఏళ్లుగా ఒకే చోట పని చేస్తుండటం సైతం వారిలో అవినీతికి పాల్పడటానికి ఊతమిస్తోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
సస్పెండ్ అవుతున్నా..
వాణిజ్య పన్నుల శాఖలో అటెండర్లు అవినీతికి పాల్పడి సస్పెండ్ అయినా వెనుకకు తగ్గటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో విజయవాడ–1,2,3 డివిజన్లు కొనసాగుతున్నాయి. ఆయా డివిజన్లలో సుమారుగా 17 సర్కిల్ కార్యాలయాలు పని చేస్తున్నాయి. గవర్నర్‌పేట సర్కిల్ కార్యాలయంలో పని చేసే కొండపల్లి శ్రీనివాసరావు గతంలో ఇదే విధంగా అవినీతికి పాల్పడుతూ సస్పెండ్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే ఒక మహిళ అటెండర్ సైతం సస్పెండ్ అయి అదే తీరులో కొనసాగుతోంది. అలాగే విజయవాడ, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో పని చేస్తున్న దిగువస్థాయి సిబ్బంది సైతం అదే తీరులో తమ అవినీతి హవాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారికి ఉన్నతాధికారులు మద్దతు సైతం ఉండటం వల్లే ఈ తరహాలో రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వసూళ్ల ‘వాణిజ్యం’లో వీరిదే హవా
అటెండ్ల దందా ఇలా..
అధికారులూ ఏం తక్కువ కాదు..
బదిలీలు లేకపోవటమే కారణమా?
వాణిజ్య పన్నుల శాఖలో
అటెండర్ల దందా
కుటుంబ సభ్యులను అధికారులుగా
చూపి ముడుపులు దండుకుంటున్న వైనం
అధికారులు సైతం ముడుపుల
వసూళ్లకు వీరినే వినియోగిస్తున్న పరిస్థితి
దీనిని అలుసుగా తీసుకొని
రెచ్చిపోతున్న అటెండర్లు
ఒక అటెండర్‌ను ఏసీబీ పట్టుకోవటం
మొదటిసారి అంటున్న అధికారులు
సస్పెండ్ అవుతున్నా వెనుకకు
తగ్గని వైనం