ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌కు మరో ముగ్గురు డీసీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌కు మరో ముగ్గురు డీసీపీలు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా కృష్ణకాంత్ పటేల్‌ను విజయవాడ సిటీ డెప్యూటీ కమిషనర్‌గా, షేక్ షిరీన్ బేగంను ట్రాఫిక్ డీసీపీగా నియమించారు. అలాగే జిల్లా రూరల్ డీసీపీగా లక్ష్మీనారాయణను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టులలో డిసెంబర్ 13న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుత్తాల గోపీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నామని సివిల్, క్రిమినల్, కాంపౌండబుల్ కేసులతో పాటు అన్ని రకాల కేసులు పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు తమతమ న్యాయవాదులను సంప్రదించి లోక్‌అదాలత్‌కు సిఫార్సు చేసుకుని కేసులను పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి సూచించారు.
మచిలీపట్నంటౌన్: పాండురంగ స్వామి వారి కార్తిక శుద్ధ ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారి రథోత్సవం కనుల పండువగా జరిగింది. ఉదయం ఆలయం వద్ద ప్రారంభమైన ఈ రథోత్సవం పురవీధుల గుండా ముందుకు సాగి తెల్లవారు జామున ఆలయానికి చేరింది. స్వామివారి దర్శనం కోసం ప్రజలు గుంపులు గుంపులుగా ఎదురొ చ్చి హారతులు ఇచ్చి టెంకాయలు కొట్టి మొక్కు లు తీర్చుకున్నారు. రథోత్సవం ముందు భాగా న డోలు సన్నాయి వాయిద్యాలతో పాటు మహిళల కోలాటం, డప్పు కళాకారుల విన్యాసాలు అమితంగా ఆకట్టుకున్నాయి. ఆలయంలో ఉదయం స్వామివారికి ద్వాదశి పారాయణ, శ్రీ లక్ష్మీ సుదర్శన హోమం వంటి పూజా కార్యక్రమాలను ఆలయ నిర్వాహకుడు టేకి నరసింహం పర్యవేక్షణలో నిర్వహించారు. రథోత్సవంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేర్ని కిట్టు, గోల్డ్ ప్రిన్స్ అధినేత తిరుమలశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
పెనుగంచిప్రోలు: కార్తిక మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పెనుగంచిప్రోలులో వేంచేసి ఉన్న తిరుపతమ్మవారిని పసుపు కొమ్ములతో అలంకరించారు. అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని పూజలు నిర్వహించారు.
షేక్ షిరీన్ బేగం
కృష్ణకాంత్ పటేల్
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌కు మరో ముగ్గురు డీసీ
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌కు మరో ముగ్గురు డీసీ
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌కు మరో ముగ్గురు డీసీ
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌కు మరో ముగ్గురు డీసీ


