సుబ్రహ్మణ్యేశ్వరుని ఆదాయం రూ. 9.25 లక్షలు
మోపిదేవి:శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆదివారం ఒక్కరోజు ఆదాయం రూ. 9,25,419 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. సేవా టిక్కెట్ల ద్వారా రూ. 4,89,208, లడ్డూ ప్రసాదం రూ.2,30,820, నిత్య అన్నదాన కార్యక్రమం ద్వారా రూ. 95,521, స్వామివారి దర్శనం టెక్కట్ల ద్వారా రూ. 41,200, శాశ్వత అన్నదానం నిమిత్తం రూ. 31,450, వంటి తదితర సేవా టిక్కెట్ల ద్వారా మొత్తం రూ. 9,25,419 ఆదాయం వచ్చినట్లు చెప్పారు. స్వామిని దర్శించుకునేందుకు ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లన్నీ భక్తజనంతో కళకళలాడాయి. ఆలయం వెలుపల భారీ ట్రాఫిక్ ఏర్పటింది. మోపిదేవి గుడి వద్ద ప్రధాన రహదారికి ఇరువైపుల భక్తుల వాహనాలు నిలిచాయి.
పెనమలూరు:గోసాల వద్ద విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందటంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం... గోసాల పెట్రోల్ బంక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి (65)ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి తెల్ల చొక్కా, గళ్ల లుంగీ ధరించి ఉన్నాడు. మృతుడి సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలపాలని కోరారు.
బస్సు ఢీకొని వ్యక్తి...
కృష్ణలంక:ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యకి దుర్మరణం చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన కట్టా గురవయ్య(55) ఓల్డేజ్ హోమ్ నడుపుతున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆదివారం ఉదయం గురువయ్య తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇబ్రహీపట్నంలో ఉంటున్న పెద్ద కుమార్తె వద్దకు వెళ్లారు. తిరిగి ప్రకాశం బ్యారేజీ మీదుగా నరసరావుపేటకు వెళ్లే క్రమంలో రైల్వేస్టేషన్ నుంచి బస్టాండ్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో గురవయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నారు.
సుబ్రహ్మణ్యేశ్వరుని ఆదాయం రూ. 9.25 లక్షలు


