
పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ రామస్వామి అన్నారు. స్థానిక ఎన్జీవో హోమ్‌లో పెన్షనర్లతో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెన్షనర్ల సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయటం లేదన్నారు. పెండింగ్ డీఏలతో పాటు పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి న్యాయం చేయాలన్నారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు సకాలంలో చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు వీవీ సుబ్బారావు, పెన్షనర్ల సంఘం నాయకులు ఏవీఎస్ ప్రసాద్, బి శంకర్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.
బులియన్ మర్చంట్స్
అధ్యక్షుడిగా కోనా శ్రీహరి
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కోనా శ్రీహరి సత్యనారాయణ ఎన్నికయ్యారు. అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశం ఆ సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా 15 మందితో కూడిన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలుత సమావేశంలో వివిధ కారణాలతో మరణించిన సభ్యులకు సమావేశం నివాళులర్పించింది. అధ్యక్షుడిగా కోనా శ్రీహరి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా పిన్నెంటి రామారావు, ప్రధాన కార్యదర్శిగా కేఎస్‌ఆర్ నాయుడు, కోశాధికారిగా రామానాథం కృష్ణబాబు, సహాయ కార్యదర్శిగా మిరియాల డూండేశ్వరరావు, కార్యవర్గ సభ్యులుగా మండే పూడి ఆనందకుమార్, కిషోర్‌గెల్డా, ఎస్‌కే ఠాగూర్, వై. చలంబాబు, మహంతి సూర్యనారాయణ, ఎస్. అనీల్‌కుమార్, కె. ఉమాశంకర్, సీహెచ్ శ్రీనివాసరావు, వి. కేశవరావు, పి. సాంబశివరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గౌరవాధ్యక్షుడు జవ్వాది సూర్యనారాయణ (రుద్రయ్య) నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు.
హెచ్‌ఎంల సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ప్రసాద్
ఉయ్యూరు: కృష్ణాజిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం నూతన అధ్యక్షుడిగా తాడంకి జెడ్పీ పాఠశాల హెచ్‌ఎం వైఎస్‌ఎన్ ప్రసాద్ ఎన్నికయ్యారు. ఉయ్యూరు జెడ్పీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల సంఘం కౌన్సిల్, జిల్లా కార్యవర్గ ఎన్నిక ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆమోదించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కె.జగదీశ్వర్‌రావు, అధ్యక్షుడిగా వైఎస్‌ఎన్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కొమ్మా విజయ్, కోశాధికారిగా కేబీఎన్ శర్మ, మహిళా కార్యదర్శులుగా కె.అనిత, ఎం. సుమలత, మునిసిపల్ ప్రతినిధిగా శోభారాణి, ఎయిడెడ్ స్కూల్స్ ప్రతినిధిగా సూర్యనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్లుగా డేవిడ్ రత్నరాజు, మోమిన్, సుబ్రహ్మణ్యం ఎన్నికయ్యారు. మచిలీపట్నం డివిజన్ అధ్యక్షుడిగా ఏవీ రమణ, ఉయ్యూరు డివిజన్ అధ్యక్షుడిగా టీవీ నాగేశ్వరరావు, గుడివాడ డివిజన్ అధ్యక్షుడిగా వి. సురేష్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జి.వెంకటేశ్వరరావు, హెడ్‌క్లస్టర్ కార్యదర్శిగా ఎన్‌వీ శ్రీథర్ ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా ఎన్‌వీ రమణ, ఈఎల్‌సీ కేశవరావు వ్యవహరించారు.

పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి

పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి