తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో సోమవారం ఎకై ్సజ్ అధికారులు తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. గంపలగూడెం మండలం ఊటుకూరు నుంచి 78 మద్యం సీసాలతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గుండ్ల శేషగిరిరావు, ఎల్లమ్మలను అదుపులోకి తీసుకున్నట్లు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. నిందితులను తిరువూరు కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించారని తెలిపారు.
బైపాస్ రోడ్డులో గుర్తు తెలియని యువకుడి మృతి
చిట్టినగర్(విజయవాడ
పశ్చిమ): పాముల కాల్వ సమీపంలోని బైపాస్ రోడ్డులో గుర్తు తెలియని యువకుడు మృతదేహా న్ని సోమవారం గుర్తించారు. సుమారు 35 సంవత్సరాల కలిగిన వ్యక్తి రోడ్డు పక్కగా పడి ఉండటాన్ని గమనించిన వాహన చోదకులు కొత్తపేట పోలీసులకు సమాచారం అందించారు. జక్కంపూడి వైఎస్సార్ కాలనీ వీఆర్వో మర్రెపూడి శివయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


