
రిజర్వ్ ఫారెస్ట్‌లో పూడ్చిన పసికందు మృతదేహాన్ని వెలికి తీయిస్తున్న పోలీసులు
ఇబ్రహీంపట్నం(మైలవరం): మండలంలోని కొండపల్లి ఖిల్లా రోడ్డు చివర రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో గుర్తుతెలియని పసిబాలుడి మృతదేహాన్ని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి కొందరు రెండు బైకులపై పసికందును గుడ్డలో చుట్టి తీసుకెళ్లడం, ఆ తర్వాత మరికొందరు పొలుగు, పారతో వెళ్లడాన్ని స్థానికులు చూసి, సీఐ పి.శ్రీనుకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాతానికి చేరుకున్న పోలీసులు తవ్వి చూడగా అందులో వారం రోజుల వయసున్న బాలుడి మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నాడు. బాలుడి చేతికి వైద్యశాలలో చికిత్స నిమిత్తం ఉపయోగించే ఐవీ క్యానులా ఉండటంతో అనారో గ్యంతో చికిత్స పొందుతూ మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. బాలుడి అంత్యక్రియలను గోప్యంగా చేయడాన్ని పోలీసులు అనుమానించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ పి.శ్రీను తెలిపారు.