డిచ్‌పల్లి: మండలంలోని సుద్దపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న కంటెయినర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఆదివారం తెల్లవారు ఝామున ఈ ప్రమాదం జరిగింది. డిచ్‌పల్లి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ్‌పూర్ నుంచి బెంగుళూరు కు స్పేర్‌పార్ట్స్ లోడ్‌తో ఓ భారీ కంటెయినర్ వెళ్తోంది. సుద్దపల్లి గ్రామం వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తు వల్ల అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డుపై పడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ షోకీన్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సర్వీస్ రోడ్డు పై ఉన్న విద్యుత్‌స్థంబాన్ని ఢీకొనడంతో విద్యుత్‌సరఫరా నిలిచిపోయింది.
దీంతో ప్రమాదం తప్పింది. అలాగే ఈ ఘటన తెల్లవారుఝామున జరగడంతో సర్వీస్ రోడ్డుపై వాహనాల లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


