నేడు జాతీయ లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు జాతీయ లోక్‌ అదాలత్‌

Jun 20 2026 11:55 AM | Updated on Jun 20 2026 11:55 AM

నిజామాబాద్‌ లీగల్‌: రాష్ట్ర న్యాయసేవ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వార కక్షిదారులు తమ పెండిగ్‌ కేసులను సత్వరం పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి జీవీఎన్‌ భారతలక్ష్మి సూచించారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో పెండింగ్‌ ఉన్న సివిల్‌, క్రిమినల్‌, ఇతర కేసులను గుర్తించినట్టు జిల్లా జడ్జి తెలిపారు. లోక్‌ అదాలత్‌ ద్వార పరిష్కరించడానికి గుర్తించిన కేసుల్లో కాంపౌండబుల్‌ క్రిమినల్‌ కేసులు 1650, యన్‌ఐ యాక్ట్‌ కేసులు 700, బ్యాంకు రికవరీ కేసులు 20, ఎంన్‌ఓపీలు 130, మ్యాట్రిమో నియల్‌ డిస్ప్యూట్స్‌ 200, సివిల్‌ కేసులు 592 కేసులు ఉండగా, ప్రీలిటిగేషన్‌తో కలిపి మొత్తం 3500 కేసులు గుర్తించినట్టు ఆమె తెలిపారు.

యాప్‌ను రద్దు చేయాలి

ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే

ఏలేటి అన్నపూర్ణ

ఆర్మూర్‌: రైతులను ఎ రువుల కోసం ఇబ్బందులు పెడుతున్న యాప్‌ను రద్దు చేసి సింగిల్‌ విండో ద్వారా నేరుగా ఎరువులను సరఫరా చేయాలని ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణ డిమాండ్‌ చేసారు. శుక్రవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కాగా, రైతులకు ఎరువులను అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. ఇప్పటికే రైతులు పంటలు విత్తుకోవాలో లేదో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే రైతులకు అవసరమున్న ఎరువులను సరఫరా చేయాలని డిమాండ్‌ చేసారు.

పుష్కర ఘాట్లను

పరిశీలించిన అధికారులు

బోధన్‌: వచ్చే ఏడాది జరుగనున్న పుష్కరాల నేపథ్యంలో రెంజల్‌ మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి నది ని జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ భుజంగరావు, ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ విజయరామారా వు, పంచాయత్‌రాజ్‌ ఇంజనీరింగ్‌, ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖల అధికారుల బృందం శుక్రవారం సందర్శించింది. గోదావరి ఒడ్డు న అధికారులు పుష్కరఘాట్లను పరిశీలించారు. ఘాట్ల నిర్మాణం, ఆలయాల మరమ్మతుల కోసం కలెక్టర్‌కు నివేదికను అందించనున్నామన్నారు. తహసీల్దార్‌ శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement