పెండింగ్‌ బిల్లుల్లో కమీషన్ల మతలబు | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ బిల్లుల్లో కమీషన్ల మతలబు

Jun 20 2026 11:55 AM | Updated on Jun 20 2026 11:55 AM

నిజామాబాద్‌ రూరల్‌: మాధవనగర్‌ ఆర్వోబీ పనులను త్వరిగతిన పూర్తి చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రం నుంచి నిధులు మంజూరు అయినా రాష్ట్ర నిధు లు ఇవ్వండంలో అలసత్వం వహిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి , టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కు మార్‌గౌడ్‌లు కమీషన్లకు ఆశపడి బ్రిడ్జి నిర్మాణానికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడుతూ దాదాపు ఐదు సంవత్సరాలుగా ఆర్వోబీ పనులకు ముగింపు పలకడం లేదన్నారు. ప్రతి రోజు సుమారు వంద అంబులెన్స్‌లు, వేలాది వాహనాలు ఆర్వోబీ గుండా ప్రయాణిస్తున్నాయన్నారు. రైల్వేగేట్‌ పడితే అంబులెన్స్‌లో ఉన్న రోగులు ప్రాణాలు కోల్పో యే ప్రమాదం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడకుండా కాంగ్రెస్‌ నాయకులు వెంటనే బ్రిడ్జి పనులను పూర్తి చేయాలని సోషల్‌ మీడియాలో వీడియోను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో రూ. 3 కోట్ల పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్‌ ఉన్నాయన్నారు. అవి మంజూరు అయితే ఆర్వోబీ పనులు వేగంగా కొనసాగుతాయన్నా రు. కాంగ్రెస్‌ నాయకులు చొరవ చూపి పనులను జరిపించాలని ఎంపీ అర్వింద్‌ కోరారు.

మాధవ నగర్‌ ఆర్వోబీ పనులకు

అడ్డుపడుతున్న మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, సుదర్శన్‌ రెడ్డి

కేంద్రం నిధులు విడుదలైనా..

మంజూరు కాని రాష్ట్ర నిధులు

ఎంపీ అర్వింద్‌ తీవ్ర విమర్శలు..

సోషల్‌ మీడియాలో వీడియో

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement