● మొదటి విడతలో
3,330 ఇళ్లు పూర్తి
● రెండో విడతలో నియోజకవర్గానికి
రెండు వేల ఇళ్లు మంజూరు
నిజామాబాద్ అర్బన్: జిల్లాలో ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందుబాటులోకి వస్తోంది. మొదటి విడతలో 14,964 ఇళ్లకు అ నుమతి లభించింది. వాటి నిర్మాణాలు ప్రస్తు తం కొనసాగుతున్నాయి. ఈ దశలోనే ఈనెల 2న ప్రతి నియోజకవర్గానికి రెండో విడతలో 2 వేల ఇళ్లు మంజూరు చేశారు. దీంతో మరింత మంది లబ్ధిదారులకు ఇళ్లు లభించనున్నాయి.
నిర్మాణ దశలో..
జిల్లాలో మొదటి విడతలో 19,397 ఇళ్లు మంజూరు కాగా, వీటిలో 14,964 ఇళ్లకు అనుమతి లభించింది. 14,029 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. 2,038 ఇళ్లు బేస్‌మీట్ స్థాయిలో ఉన్నాయి. 1,249 ఇళ్లు రూప్‌లెవల్‌లో ఉన్నాయి. 5,229 ఇళ్లు స్లాబ్‌లెవల్‌లో ఉన్నాయి. 3,330 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఇటీవల గృహప్రవేశాలు కూడా జరిగాయి.
బిల్లుల మంజూరు ఆలస్యం..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు. విడతల వారీగా బిల్లులు మంజూరు చేయాల్సి ఉండగా, రెండు నెలల వరకు బిల్లులు ఆలస్యమవుతున్నాయి. జిల్లాలో 750 పైబడిన ఇళ్లకు బిల్లుల మంజూరుకు ఆలస్యమైంది. ప్రస్తుతం 270 ఇళ్లకు రెండు నెలలుగా బిల్లులు మంజూరు కావడం లేదు. బిల్లులు మంజూరు అయితే ఇళ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. లబ్ధిదారు ల్లోనూ మరింత ఉత్సాహం వస్తుంది.
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇలా..
త్వరగా పూర్తి చేస్తాం
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఇళ్లు లేని పేదలకు ఉపయోగకరంగా ఉంది. రెండో విడతలో ఇళ్లు మంజూరు అయ్యాయి. త్వరిగతిన లబ్ధిదారులను గుర్తించి ఇళ్లు మంజూరు చేస్తాం. వేగంగా నిర్మాణాలు పూర్తిచేస్తాం. – గంగాధర్, హౌసింగ్ డీఈ


