యూరియా సరఫరాలో కేంద్రం తాత్సారం | - | Sakshi
Sakshi News home page

యూరియా సరఫరాలో కేంద్రం తాత్సారం

Jun 17 2026 5:33 AM | Updated on Jun 17 2026 5:33 AM

నిజామాబాద్‌ రూరల్‌: రాష్ట్రానికి ఇవ్వాల్సిన యూరియా కోటాను ఇవ్వకుండా కేంద్ర ప్రభు త్వం తాత్సారం చేస్తోందని, బీజేపీని నిలదీయా లని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 39 వేల మంది రైతులకు 3.78 లక్షల యూ రియా బస్తాలు పంపిణీ చేశామని తెలిపారు. జిల్లాలో యూరియా కొరత లేదని.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు తోడుదొంగల్లా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని విమర్శించారు. నగరంలోని క్యాంప్‌ కార్యాలయంలో ఎ మ్మెల్యే మంగళవారం మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 207 రైతు వేదికల నుంచి ఎకరం, రెండెకరాలు, అంతకు ఎక్కువ భూమి ఉన్న రైతులకు విడతల వారీగా యూరి యా పంపిణీ జరుగుతోందన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా, అక్రమ రవాణాను నివారించేందుకు తీసుకువచ్చిన యాప్‌ ద్వారా యూరి యా పంపిణీ జరుగుతోందన్నారు. యా ప్‌లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 5.30 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేయనున్నారని, 80,857 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు 38,766 మెట్రి క్‌ టన్నులు జిల్లాకు చేరిందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో యూరియా కోసం రైతు లు క్యూలలో చెప్పులు పెట్టి పడిగాపులు కా సిన సంగతి మరిచిపోయారా అని ప్రశ్నించారు. సమావేశంలో రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార ఆర్ధిక కార్పొరేషన్‌ చైర్మన్‌ శేఖర్‌గౌడ్‌, ఏఎంసీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ మునిపల్లి సాయారెడ్డి, భాస్కర్‌రెడ్డి, పొలసాని శ్రీనివాస్‌, అగ్గు భోజన్న, హన్మాండ్లు, బోర్గాం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో ఎరువు కొరత లేదు

28వేల మెట్రిక్‌ టన్నులు

అందుబాటులో ఉంది

లక్షా 39వేల మంది రైతులకు

3.78 లక్షల బస్తాలు పంపిణీ

మీడియాతో రూరల్‌ ఎమ్మెల్యే

భూపతిరెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement