జక్రాన్‌పల్లి : మండలంలోని పడకల్ జెడ్పీ హైస్కూల్‌లో విద్యనభ్యసిస్తున్న వోల్కాజీ చందన, ఈ ర్ల జగదీశ్వరి సౌత్ ఇండియా వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. శ్రీవినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రం మహాబలిపురంలో బుధవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ గడ్డం శ్రీనివాస్ తెలిపారు. ఇది వరకే చందన రెండుసార్లు జాతీయ స్థాయి పోటీల్లో, జగదీశ్వరి మూడుసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించారని అ న్నారు. చందన, జగదీశ్వరిని సర్పంచ్ లోక స్వప్న, ఉప సర్పంచ్ పురుషోత్తంరెడ్డి, హెచ్‌ఎం గడ్డం సురేందర్‌రెడ్డి, ఇండియన్ వాలీబాల్ వైస్ ప్రెసిడెంట్ ఎన్‌వీ హనుమంత్‌రెడ్డి, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లేశ్‌గౌడ్, వీడీసీ సభ్యులు అభినందించారు.
యూడీఐఎస్‌ఈకి దరఖాస్తు చేసుకోవాలి
ఖలీల్‌వాడి: జిల్లాలో నూతనంగా ప్రారంభించిన పాఠశాలలు, కళాశాలలు యూడీఐఎస్‌ఈ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్ట మ్ ఫర్ ఎడ్యుకేషన్)కు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో పార్శి అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ప్రైవేట్ యాజ మాన్య, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు, ఇప్పటివరకు యూడీఐఎస్‌ఈ కోడ్ పొందని యాజమాన్యాలు పూర్తి వివరాలతో ఈనెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తులను సంబంధిత మండల విద్యాధికారి కార్యాలయంలో లేదా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గడువులోగా సమర్పించాలని సూచించారు.
పాస్‌పోర్ట్ కేంద్రాల్లో సేవలు వేగవంతం
సుభాష్‌నగర్: జిల్లాలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో సేవలు వేగవంతమయ్యాయని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణతో కలిసి నిజామాబాద్ నగరంలోని ప్రగతినగర్‌లో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ఎంపీ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిణి ఉ దయలక్ష్మితోపాటు ఇతర అధికారులతో మాట్లాడారు. అక్కడే ఉన్న దరఖాస్తుదారుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అ ధికారిణి స్నేహజ జొన్నలగడ్డతో వర్చువల్ గా మాట్లాడారు. సాధారణ దరఖాస్తుదారులకు వారం రోజుల్లో, తత్కాల్ దరఖాస్తుదారులకు మూడు రోజుల్లో పాస్‌పోర్టులు అందుతున్నాయని ఎంపీ అన్నారు. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో సమర్థవంతమైన సేవల అందిస్తున్న అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఆయన వెంట కార్పొరేటర్లు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బొబ్బిలి సువర్ణవేణు, బీజేపీ నాయకులు ఉన్నారు.


