ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

Jun 17 2026 5:33 AM | Updated on Jun 17 2026 5:33 AM

డిచ్‌పల్లి: శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లల ను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా విద్యాధికారి అశోక్‌ అన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి ఉన్నత పాఠశాలను డీఈవో సందర్శించారు. సర్పంచ్‌ లొక్కిడి యాదగిరితో కలిసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల ను వి ద్యార్థులు సద్వినియోగం చేసుకుని బాగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ఎంఈవో నరేశ్‌, డీసీఈబీ సెక్రెటరీ, హెచ్‌ఎం బి సీత య్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement