● జిల్లాలో అందుబాటులో రక్తపు నిల్వలు
● కీలకంగా మారిన బ్లడ్ డోనర్స్ గ్రూపులు
● యువతలో పెరుగుతున్న అవగాహన
సుభాష్‌నగర్: రక్తదానం చేయడమంటే మరో ము గ్గురికి ప్రాణదానం చేసినట్లే.. రక్తదాతలుగా వచ్చి ప్రాణదాతలుగా నిలవాలని వైద్యులు పేర్కొంటున్నారు. రక్తం అందక ఏ ఒక్కరి ప్రాణం కోల్పోవ ద్దని అనేక క్లబ్‌లు, రెడ్‌క్రాస్, ఇతర వ్యవస్థలు పని చేస్తున్నాయి. ముఖ్యంగా యువతలో మరింత అవ గాహన కల్పిస్తున్నారు.
జిల్లాలో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీ హెచ్), రెడ్‌క్రాస్ సొసైటీతోపాటు మరో 8 వరకు ప్రయివేటు బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. జీజీహెచ్ లో సుమారు 250 యూనిట్ల వరకు, రెడ్‌క్రాస్ సొసైటీలో 100 పైగా యూనిట్లు అందుబాటులో ఉన్నా యి. రోడ్డు ప్రమాదాలు, రక్తహీనత, డెలివరీలు, తలసేమియా, శస్త్ర చికిత్సలు తదితర అత్యవసర సమయాల్లోనే రక్తం ఇస్తున్నారు.
చరిత్ర
ప్రముఖ జీవశాస్త్రవేత్త, వైద్యుడు కారల్ ల్యాండ్ స్టీనర్ 19వ శతాబ్దంలో మానవ రక్తకణాలు కను గొన్నందుకుగాను 1930లో నోబెల్ బహుమతి లభించింది. ఆయన జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి యేటా జూన్ 14న రక్తదాతల దినోత్సవాన్ని జరుపుతున్నారు.
అపోహలు వీడి..
సమాజంలో కొంతమంది అపోహలకు గురై రక్తదానానికి దూరంగా ఉంటారు. అయితే వాట్సాప్, సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన పెరిగి యువత రక్తదానికి ముందుకు వస్తున్నారు.
రక్తదానానికి వీరు అర్హులు..
రక్తదాత వయస్సు 18 నుంచి 60 ఏళ్లలోపు ఉండాలి. శరీర బరువు కనీసం 45 కిలోలకుపైబడి ఉండాలి. రక్తదాత నుంచి సేకరించే రక్తం (300ఎం.ఎల్) ఒక యూనిట్ మాత్రమే. యువతీ యువకుల్లో టాటు వేయించుకున్నవారు రక్తదానం చేయడం ప్ర మాదకరం.
రక్తదానం చేస్తున్న తోట రాజశేఖర్, పురుషోత్తంరెడ్డి
ఆదర్శంగా ఇందూరు
బ్లడ్ డోనర్స్ గ్రూప్
జిల్లావ్యాప్తంగా అనేక బ్లడ్ డోనర్స్ గ్రూపులు పని చేస్తున్నాయి. ఈ గ్రూపుల ద్వారా సమాచారం తెలుసుకుంటున్న అనేక మంది రక్తదాతలు రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చి ప్రాణాలు కాపాడుతున్నారు. అలాంటి గ్రూపుల్లో ఇందూరు బ్లడ్ డోనర్స్ గ్రూప్ ఆదర్శంగాా నిలుస్తోంది. సుమారు 470 మంది సభ్యులు ఉన్న ఈ గ్రూప్ పదో వార్షికోత్సవం పూర్తిచేసుకుంది. ఇప్పటివరకు దాదాపు మూ డు వేల మందికి రక్తదానం చేశారు. ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. అదేవిధంగా జిల్లా లో ప్రతి ఇంటికి ఒక రక్తదాత ఉండేలా ప్రజలు, యువతను ప్రతి నిత్యం అవగాహన కల్పిస్తోంది రెడ్‌క్రాస్ సొసైటీ. రక్తదాతలుగా రండి.. ప్రాణదాతలుగా నిలవండి అనే నినాదాన్ని విస్తృతంగా యువతలోకి తీసుకెళ్తుంది.
నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
మూడు నెలలకోసారి రక్తదానం చేస్తా
ప్రతి మూడునెలలకొకసారి రక్తం దానం చేస్తాను. ఇప్పటివరకు 86 సార్లు చేశాను. మంజీరా హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా రక్తదాతలను తయారు చేసేందుకు యువతకు అవగాహన కల్పిస్తున్నాం. రక్తం దానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. అత్యవసరంగా రక్తం అవసరమైన వారి కోసం ఎంత దూరమైనా వెళ్లి ఇస్తాను.
– పురుషోత్తం రెడ్డి, మంజీరా హెల్పింగ్ హార్ట్స్
ఫౌండేషన్ ప్రతినిధి
87 సార్లు రక్తదానం చేశాను
ఇప్పటివరకు 87 సార్లు రక్తదానం చేశాను. ప్రతి మూడు, నాలుగు నెలలకొకసారి రక్తదానం చేస్తుంటాను. రక్తం దానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటున్నాను. ఒకరి రక్తదానం. ముగ్గురికి ప్రాణదానం. రక్తం ఇవ్వడం వల్ల కొత్త రక్తకణాలు ఉత్పత్తి అవుతాయి. యువత కూడా అపోహలు వీడి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి. రక్తం కొరత వల్ల ఏ ఒక్క ప్రాణం పోకూడదనే ఏకైక లక్ష్యంతో ఉన్నాం.
– తోట రాజశేఖర్, రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర ప్రతినిధి


