రెక్కలు | - | Sakshi
Sakshi News home page

రెక్కలు

Jun 7 2026 9:12 AM | Updated on Jun 7 2026 9:12 AM

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌
భూముల ధరలకు

వాలీబాల్‌ @ కలిగోట్‌

జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌ గ్రామానికి చెందిన వందలాది మంది క్రీడాకారులు వాలీబాల్‌లో రాణిస్తున్నారు.

ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్‌ శ్రీ 2026

– 8లో u

రాష్ట్ర ప్రభుత్వం భూముల, స్థిరాస్తుల మార్కెట్‌ విలువను పెంచడంతో నగరం, పట్టణ ప్రాంతాల్లోని కమర్షియల్‌ ఏరియాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇదిలా ఉండగా రెండ్రోజుల కిత్రం నిజామాబాద్‌ అర్బన్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో 15 రిజిస్ట్రేషన్లు మాత్రమే కావడం గమనార్హం. భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో లావాదేవీలు తగ్గుతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : రాష్ట్రంలో భూముల, స్థిరాస్తుల మార్కెట్‌ విలువను ప్రభుత్వం పెంచడంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. జిల్లా కేంద్రమైన నిజామాబాద్‌ నగరంతో పాటు బోధన్‌, ఆర్మూర్‌ పట్టణాల్లో, ఆయా మండల కేంద్రాల్లో, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగాయి.గ్రామాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ఈ పెంపు ఉండడంతో అన్నివర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. నిజామాబాద్‌ నగరంలోని కమర్షియల్‌ జోన్లలో, బోధన్‌, ఆర్మూర్‌ పట్టణాల్లో ప్రధాన రహదారుల వెంట ధరలు అమాంతం పెరిగాయి.

● భీమ్‌గల్‌లో వ్యవసాయ భూమి ఎకరానికి రూ.3.75 లక్షలు ఉండగా ప్రస్తుతం ఏకంగా రూ.6.50 లక్షలకు పెరిగింది. ఇళ్ల స్థలాలకు దగ్గరగా ఉన్న వ్యవసాయ భూముల ధరలు 150 శాతం పెంచారు. జిల్లాలోని నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌లలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లాలో సాధారణంగా ప్రతిరోజూ సుమారు 500 వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. నిజామాబాద్‌ అర్బన్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పరిధిలో ప్రతిరోజూ 60 నుంచి 70 వరకు రిజిస్ట్రేషన్లు ఉండేవి. కాగా శుక్రవారం ఇక్కడ కేవలం 30 స్లాట్‌ బుకింగ్‌లు కాగా 15 రిజిస్ట్రేషన్లు మాత్రమే కావడం గమనార్హం. భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో లావాదేవీలు తగ్గుతాయని జనం చెబుతున్నారు.

● నిజామాబాద్‌ అర్బన్‌ రిజిస్ట్రేషన్‌ పరిధిలోకి వచ్చే నగరంలోని కీలకమైన కమర్షియల్‌ ప్రాంతంగా ఉన్న ఖలీల్‌వాడితో పాటు ద్వారకానగర్‌, ఎల్లమ్మగుట్ట, నిజామాబాద్‌ బస్‌స్టేషన్‌, కంఠేశ్వర్‌, మార్కెట్‌యార్డు, గాంధీచౌక్‌ ప్రాంతాల్లో ప్రస్తుతం గజం రూ.37,400 ఉన్న ధర ఇప్పుడు ఏకంగా రూ.56,100 మేర పెరిగింది.

● ఇందూరు నగరానికి ఆనుకుని ఉన్న కాలూరు ఏరియాలో రూ.700 ఉన్న గజం భూమి ధర ఇప్పుడు రూ.1,500 వరకు పెరిగింది. ఖానాపూర్‌ ప్రాంతంలో గజం రూ.1,100 నుంచి రూ.1,900 వరకు పెరిగింది.

● నగరానికి సమీపంలోని మోపాల్‌ మండలంలోనూ ధరలు పెరిగాయి. గజం ధర రూ.600 నుంచి రూ.1,500కు పెరగడం గమనార్హం.

● జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దులోని రెంజల్‌, సాలూర మండలాల్లోని పలు గ్రామాల్లో కనీస ధర రూ.600 వరకు పెరిగింది.

● బోధన్‌ బస్‌స్టేషన్‌ ప్రాంతాల్లో గజం భూమి ధర రూ.15,800 ఉండగా ప్రస్తుతం రూ.27,800కు పెరిగింది. బోధన్‌ మండలంలోని గ్రామాల పరిధిలో గజం ధర రూ.900 వరకు పెరిగింది.

కమర్షియల్‌ ఏరియాల్లో

అమాంతం పెరిగిన రేట్లు

నగరంలోని ఖలీల్‌వాడిలో

గజానికి రూ.18,700 పెంపు

భూముల లావాదేవీలపై ప్రభావం..

తగ్గిన రిజిస్ట్రేషన్లు,

వ్యవసాయ భూముల రేట్లు రెట్టింపు

Advertisement
 
Advertisement
Advertisement