నిత్యం ట్రా‘ఫికరే..’ | - | Sakshi
Sakshi News home page

నిత్యం ట్రా‘ఫికరే..’

Apr 25 2026 7:18 AM | Updated on Apr 25 2026 7:18 AM

మాధవనగర్‌ రైల్వే గేటు వద్ద

వాహనదారుల ఇబ్బందులు

పట్టించుకోని అధికారులు

నిజామాబాద్‌ రూరల్‌: నగర శివారులోని మాధవనగర్‌ రైల్వే గేటు వద్ద వాహనదారులకు నిత్యం ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్క సారి గేటు పడిదంటే చాలు ఇరువైపులా అర కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ఒకవైపు ఆర్వోబీ పనులు, మరోవైపు రోడ్డు ఇరుకుగా మారింది. వీటికి తో డు భారీ వాహనాల రాకపోకలతో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రైల్వే గేటు వేయటంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయా యి. గేటు తీసిన తర్వాత ద్విచక్ర వాహనదారులు రాంగ్‌రూట్‌లో దూసుకురావడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ట్రాఫిక్‌ క్లియర్‌ అయ్యేలోపు మళ్లీ గేటు పడటంతో పరిస్థితి మొదటికొచ్చింది. ఇలా నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహ నదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారు లు స్పందించి ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement