జిల్లావాసికి ఐఏఎస్‌గా పదోన్నతి
మాక్లూర్: రియల్ ఎస్టేట్ రెగ్యులెటరీ అథారిటీ(రెరా) ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, జిల్లాకు చెందిన కే. గంగాధర్‌కు ఐఏఎస్ పదోన్నతి లభించింది. ఆలూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన గంగాధర్ 10వ తరగతి వరకు స్థానిక గుత్ప ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఇంటర్మీడియట్ ఖిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ, ఉస్మానియూ యూనివర్సిటీలో పీజీ చదివి 1995లో గ్రూప్–2కు ఎంపికై డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ హైదరాబాద్‌లోని రెరా ఈడీగా పనిచేస్తూ తాజాగా ఐఏఎస్ పదోన్నతి పొందారు. దీంతో గుత్ప గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.


