సకల విద్యకు అధిదేవత సరస్వతి దేవి
● నేడు వసంత పంచమి
● ఆలయాలు, పాఠశాలల్లో
చిన్నారులకు అక్షరాభ్యాసాలు
నిజామాబాద్ రూరల్: సర్వ విద్యలకు ఆధారం వాగ్ధేవి. ‘వాగేశ్వరీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి’ అనేక నామాలతో భక్తులు అమ్మవారిని కొలుస్తారు. జ్ఞానప్రాప్తి కోసం సరస్వతీదేవిని ఆరాధిస్తుంటారు. శుక్రవారం అమ్మవారి పుట్టిన రోజు సందర్భంగా వసంత పంచమిని జరుపుకోనున్నారు. ఆలయా లు, పాఠశాలల్లో చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సరస్వతీ మాత కొలువైన ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేయనున్నారు.


