నకిలీ కరెన్సీ ముఠా సభ్యుడిపై పీడీ యాక్టు
కామారెడ్డి క్రైం: కామారెడ్డి పోలీసులు ఇటీవల పట్టుకున్న నకిలీ కరెన్సీ సరఫరా ముఠాకు చెందిన మరో నిందితునిపై పీడీ యాక్టు నమోదైంది. కామారెడ్డిలో వెలుగుచూసిన నకిలీ కరెన్సీ ఆధారంగా కేసు నమోదు చేసి 14 మంది సభ్యులు గల అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. ముఠాలోని వారంతా తరచూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇప్పటివరకు ఈ ముఠాకు చెందిన 9 మందిపై దశల వారీగా పీడీ యాక్టు నమోదు చేశారు. తాజాగా ముఠా సభ్యుడైన ఛత్రాం ఆదిత్యపై పీడీ యాక్టు జారీ చేశామని ఎస్పీ రాజేశ్ చంద్ర శుక్రవారం తెలిపారు. నిజామాబాద్ సెంట్రల్ జైలులో ఉన్న నిందితునికి పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి పీడీ యాక్టు ఉత్తర్వులను అందజేశారు.


