పీజీ పరీక్ష కేంద్రం తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పీజీ పరీక్ష కేంద్రం తనిఖీ

Jan 24 2026 7:12 AM | Updated on Jan 24 2026 7:12 AM

పీజీ

పీజీ పరీక్ష కేంద్రం తనిఖీ

పీజీ పరీక్ష కేంద్రం తనిఖీ వర్సిటీలో జాతీయ ఓటరు దినోత్సవం వందేమాతర గీతం ఉద్యమానికి ఊపిరి పోసింది

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. వర్సిటీ పరిధిలో ఏర్పాటు చేసిన ఐదు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్యాంపస్‌లోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌, లా కాలేజ్‌ లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కంట్రోలర్‌ సంపత్‌ కుమార్‌తో కలిసి చంద్రశేఖర్‌ తనిఖీ చేశారు. మధ్యాహ్నం నిర్వహించిన బీఎడ్‌, బీపీఎడ్‌ పరీక్షలకు 2,798 మందికి 2,730 మంది హాజరు కాగా 68 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే ఏపీఈ, ఐపీసీహెచ్‌, ఐఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎమ్‌ రెండో రోజు పరీక్షలకు 230 మందికి 218 మంది హాజరు కాగా 12 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ తెలిపారు. ఆయన వెంట అడిషనల్‌ కంట్రోలర్‌ సంపత్‌ ఉన్నారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్‌) యూనిట్‌–2 ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ.. పౌరుల్లో అవగాహన కలిగించి, నైతికతతో కూడిన ఓటింగ్‌కు ప్రోత్సాహం ఇవ్వడమే లక్ష్యంగా ప్రత్యేక ఓటరు దినోత్సవం జరుపుకొంటామని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు ఓటరు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ అబ్దుల్‌ హలీమ్‌ ఖాన్‌, అధ్యాపకులు, వలంటీర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

తెయూ(డిచ్‌పల్లి): స్వదేశీ ఉద్యమానికి వందే మాతర గీతం ఊపిరిగా నిలిచిందని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత కార్యవాహ కాచం రమేశ్‌ జీ అన్నా రు. అంబేడ్కర్‌ రీసెర్చ్‌ స్టడీ సర్కిల్‌–తెలంగాణ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసు కున్న సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సెమినార్‌లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఉద్యమానికి ఒక నినాదం అనేది మార్గదర్శికగా నిలుస్తుందన్నారు. పా శ్చాత్య దేశాలు వాళ్ల.. వాళ్ల దేశాన్ని ల్యాండ్‌ ఆఫ్‌ ఫాదర్‌గా కొలిస్తే భారతీయులు మాత్రం తమ దేశాన్ని మాతృభూమిగా ఆరాధిస్తారని పేర్కొన్నారు. బంకించంద్ర చటర్జీ రాసిన వందేమాతర గీతాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎందరో యువకులు స్వాతంత్రం కోసం ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు. వర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రాంబాబు, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆరతి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రాంత సహ బౌద్ధిక్‌ ప్రముఖ్‌ నర్రా వెంకట శివ కుమార్‌ జీ, లక్కారం చక్రధర్‌, ఉల్లెంగ ముత్యం, వార్తె దస్తగిరి, పేట గంగారెడ్డి, గంపల భార్గవ్‌, అమృత్‌ చారి, నవదారి చందు, సంతోష్‌, మధు, శ్రావణ్‌, శివ, దిగంబర్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పీజీ పరీక్ష కేంద్రం తనిఖీ 1
1/2

పీజీ పరీక్ష కేంద్రం తనిఖీ

పీజీ పరీక్ష కేంద్రం తనిఖీ 2
2/2

పీజీ పరీక్ష కేంద్రం తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement