కే గంగాధర్ జ్యువెలర్స్ షోరూం ప్రారంభం
నిజామాబాద్ రూరల్: నగరంలోని హైదరాబాద్ రోడ్డులో ఏర్పాటు చేసిన కే గంగాధర్ జ్యువెలర్స్ షోరూంను హీరోయిన్ రితిక నాయక్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తమ వద్ద నాణ్యమైన బంగారు ఆభరణాలు అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, షోరూం యజమాని రాజేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని మైనారిటీ జూనియర్ బాలుర కళాశాలలో ఉచితంగా అందించే ఐఐటీ, నీట్, క్లాట్, సీఏ, సీఎస్ కోచింగ్ ప్రవేశానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి శుక్రవారం అన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఉచిత అడ్మిషన్ల పోస్టర్లను ఆవిష్కరించారు. మరిన్ని వివరాలకు 8985783112, 9603888786, 9640335728 నంబర్లను సంప్రదించాలని సూచించారు.


