చోరీ కేసులో అంతర్‌రాష్ట్ర నిందితుడి అరెస్ట్
బాన్సువాడ: మహిళను కత్తితో బెదిరించి ఆమె మె డలో ఉన్న పుస్తెలతాడును ఎత్తుకెళ్లిన అంతర్‌రాష్ట్ర నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. సో మవారం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీర్కూర్ మండలం బరంగెడ్గి గ్రా మానికి చెందిన బోయి అనుషవ్వ డిసెంబర్ 2న బీర్కూర్‌లో అంగడి చేసుకొని నడుచుకుంటూ వె ళ్తుండగా హెగ్డోలే హన్మంత్ విఠల్ అనే వ్యక్తి బైక్‌పై వచ్చి లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ఆమెను ఎక్కించుకున్నాడు. బైరాపూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో బైక్ ఆపి తన వద్ద ఉన్న కత్తిని చూపి చంపుతానని బెదిరించాడు. ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడు, బంగారు గుండ్లు, కెంపులను బలవంతంగా లాక్కొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బీర్కూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఈ నెల 18న బీర్కూర్ కమాన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా నిందితుడు పారిపోయే ప్రయత్నం చేయగా చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం విచారణ చేపట్టగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడని డీఎస్పీ తెలిపా రు. నిందితుడిది నాందేడ్ జిల్లా దెగ్లూర్ తాలూకా పెల్గావ్ గ్రామమని పేర్కొన్నారు. నిందితుడి నుంచి కత్తి, బైక్, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. కేసును ఛేదించిన సీసీఎస్ బృందం, రూరల్ సీఐ తిరుపయ్య, ఎస్సై మహేందర్‌ను ఎస్పీ రాజేశ్‌చంద్ర అభినందించినట్లు ఆయన తెలిపారు.


