డాక్టర్లు, మందులు ఉండేలా చూడాలి
సుభాష్‌నగర్: వెల్‌నెస్ సెంటర్‌లో డాక్టర్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని, డాక్టర్ల తక్షణమే నియమించాలని తెలంగాణ ఆ ల్ పెన్షనర్స్–రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆ ధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో అడిషన ల్ కలెక్టర్ కిరణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అనేక రోజులుగా డాక్టర్లు అందుబాటులో లేరని, ఈ విషయమై సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించడం లేదని పే ర్కొన్నారు. దీంతో స్పందించిన అదనపు కలెక్టర్ వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీచేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సిర్ప హన్మాండ్లు, ప్రధాన కార్యదర్శి నారాయణ, కోశాధికారి వీరయ్య, డివిజన్ కార్యదర్శి సాంబశివరావు, జిల్లా నాయకులు ప్రసాదరావు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


