మూడు సెంటర్లు
జేఈఈ మెయిన్స్‌కు
● నేటి నుంచి 29 వరకు
పరీక్షల నిర్వహణ
● జిల్లా కేంద్రంలో పరీక్ష రాయనున్న 4,171 మంది విద్యార్థులు
ఖలీల్‌వాడి: ఎన్‌ఐటీల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి, జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొందేందు కు బుధవారం నుంచి జేఈఈ మెయిన్స్ ప్రా రంభం కానున్నది. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష(సీబీటీ)కు జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) సిటీ కోర్డినేటర్ భాస్కర్ మెరిగా మంగళవారం తెలిపారు. నగరంలోని అర్సపల్లిలోని ఏవీ ఎంటర్‌ప్రైజెస్, ఆర్మూర్ మండలం చేపూర్‌లోని క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాల, మల్లారంలోని స్విఫ్ట్ టెక్నాలజీస్, ఆయేషా కాలేజ్ ఆఫ్ ఎ డ్యుకేషన్‌లో పరీక్షలు జరుగుతాయన్నారు. బు ధవారం నుంచి ఈ నెల 29 వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు ఉంటా యని పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు పేపర్–1, 29న పేపర్–2 నిర్వహించనున్నారు. జిల్లాలోని పరీక్ష కేంద్రాల్లో మొత్తం 4,171 మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్స్ రాయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు తీసుకురావాలి, గడియారాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, నిషేధిత వస్తువులు పరీక్ష హాల్లోకి అనుమతించబడవని పేర్కొన్నారు. వివరాలకు 89781 98421నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
ఖలీల్‌వాడి: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అకౌంటెంట్, ఏఎన్‌ఏం పోస్టులను 2025–26 సంవత్సరానికి కాంట్రాక్ట్ పద్ధతిలో మెరిట్ కం రోస్టర్ ప్రతిపాదికగా భర్తీ చేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈవో పా ర్శి అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అకౌంటెంట్ పోస్టుకు బీసీ(ఈ)కి చెంది నవారై డిగ్రీలో బీకాం కంప్యూటర్ పూర్తి చేయడంతోపాటు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ పూ ర్తి చేసినవారు అర్హులని పేర్కొన్నారు. ఏఎన్ ఎం పోస్టుకు మహిళా దివ్యాంగ అభ్యర్థులు ద రఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అకౌంటెంట్, ఏఎన్‌ఎం ఒక్కో పోస్టు ఖాళీగా ఉందని తెలిపారు. దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి కలెక్టరేట్‌లోని విద్యాశాఖ కార్యాలయంలో ఈ నెల 23వ తేదీ వరకు అందించాలని సూచించారు.
సమర్థవంతమైన
నేతలను ఎన్నుకోవాలి
● ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ రూరల్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకులనే ఎన్నుకోవాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన బాన్సువాడ పట్టణంలోని 15, 16 వార్డుల్లో స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. గ్రామ పంచాయతీగా ఉన్న బాన్సువాడను మున్సిపాలిటీగా మార్చుకుని సుమారు రూ.200 కోట్లతో అభివృద్ధి చేశానన్నారు. రానున్న రోజుల్లో బాధ్యతతో పనిచేసే వారిని ఎన్నుకుంటే రాష్ట్రంలోనే బాన్సువాడ మున్సిపాలిటీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెల్సుకున్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, నాయకులు జంగం గంగాధర్, కృష్ణారెడ్డి, గురువినయ్, శ్రీధర్, ఎజాజ్, అసద్‌బిన్ మోసీన్, నర్సన్నచారీ, నార్లసురేష్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.


