ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి
బోధన్: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకుని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆర్‌జీయూకేటీ (రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ) అసోసియేట్ డీన్ విఠల్ సూచించారు. సాలూర పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌లో మంగళవారం కెరీర్ గైడెన్స్ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై, మాట్లాడారు. క్రమశిక్షణతో కూడిన అధ్యయనం భవిష్యత్తుకు దా రి చూపుతుందన్నారు. సైకాలజిస్ట్ శ్రీనివాస్, ఎంఈవో రాజిమంజూష, ఉపాధ్యాయులు ఉన్నారు.


