నిర్మాణంలో ఉన్న భవనం సీజ్
సుభాష్‌నగర్: నగరంలోని పూ సలగల్లిలో ఓ ఫారెస్ట్ అధికారి ని ర్మిస్తున్న రెండంతస్తుల భవనా న్ని టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి నోటీసులు అతికించి మంగ ళవారం సీజ్ చేశారు. భవనం మొదటి, రెండో అంతస్తు నిర్మాణం పరిధి దాటి చేస్తుండటంతో ఓ వ్యక్తి టౌన్‌ప్లానింగ్ అధికారులకు గతంలో ఫిర్యా దు చేశారు. అధికారులు పరిశీలించి భవన నిర్మాణానికి అనుమతులు లే వని, ఫిర్యాదులు అందాయని, వెంటనే పనులు నిలిపేయాలని సూచించారు. పనులు కొనసాగుతుండటంతో కోర్టును సైతం ఆశ్రయించారు. ప నులు తక్షణమే ఆపేయాలని చెప్పినా.. సదరు ఫారెస్ట్ అధికారి పట్టించుకోలేదు. అధికారులు వెళ్లినప్పుడు పనులు నిలిపేసి.. ఆ తర్వాత నిర్మాణా న్ని కొనసాగించారు. దీంతో ఏసీపీ శ్రీధర్‌రెడ్డి మంగళవారం పోలీస్ బలగాలతో వెళ్లి భవనానికి నోటీసులు అతికించి సీజ్ చేశారు.


