చికిత్స పొందుతూ ఒకరు మృతి
బాన్సువాడ రూరల్: చలిమంటలకు గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికి త్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు.. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామానికి చెందిన ఎండీ సా హెబ్ అలీ(41) కొన్నేళ్ల క్రితం బాన్సువాడకు వ లస వచ్చాడు. పట్టణంలోని ఇస్లాంపుర కాలనీలో నివాసముంటూ సంతల్లో చేపలు శుభ్రంచేసి కట్‌చేసే పనులు చేసేవాడని తెలిసింది. ఈనెల 16న రాత్రి అతడు ఇంటిబయట ఉన్న చలిమంటల వద్దకు వచ్చాడు. ఈక్రమంలో అతడి దుస్తువులకు మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 19న మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ ఎస్‌హెచ్‌వో శ్రీధర్ తెలిపారు.
భిక్కనూరు మండలంలో..
భిక్కనూరు: పతంగి ఎగురవేస్తూ భవనం పైనుంచి కిందపడి గాయపడిన ఓ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన ఆవుసుల ప్రకాశ్ సిద్దిపేట జిల్లా కేంద్రంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆయన చిన్న కుమారుడు కార్తీక్ (11) ఈనెల 15న (సంక్రాంతి రోజున) సిద్ధిపేటలోని రెండంతస్తుల భవనం పైనుంచి గాలిపటం ఎగురవేస్తుండగా, ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. స్వగ్రామంలో మధ్యాహ్నం కార్తీక్ మృతదేహానికి అంత్యక్రియలను నిర్వహించారు.
ఎల్లారెడ్డి రూరల్ : ఎల్లారెడ్డి మండలం అడవి లింగాల గ్రామంలో అన్నదమ్ములు మృతి చెందారు. గ్రామానికి చెందిన అవిసుల అంజయ్య (48) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందగా, కొద్ది గంటలకే అతడి తమ్ముడు నాగభూషణం (46) మూర్చ వ్యాధి వచ్చి మృతి చెందాడు. ఒకేరోజు అన్నదమ్ములు గ్రామంలో మృతి చెందడం పట్ల కుటుంబీకులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.


