పేలుడు పదార్థాలు స్వాఽధీనం | - | Sakshi
Sakshi News home page

పేలుడు పదార్థాలు స్వాఽధీనం

Jan 20 2026 8:25 AM | Updated on Jan 20 2026 8:25 AM

పేలుడ

పేలుడు పదార్థాలు స్వాఽధీనం

కామారెడ్డి క్రైం : ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్న ముగ్గురిని రామారెడ్డి పోలీసులు అరెస్ట్‌ చేశారని ఎస్పీ రాజేశ్‌ చంద్ర తెలిపారు. వారి వద్దనుంచి 70 జిలెటిన్‌ స్టిక్స్‌, 10 డిటోనేటర్లు, ఇతర సామగ్రిని స్వాఽధీనం చేసుకున్నామన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్‌ చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామారెడ్డిలో ఆదివారం ఉదయం వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని గర్గుల్‌కు చెందిన రాజు, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం మౌలమవ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన శేషులాల్‌గా గుర్తించారు. ఇద్దరూ కలిసి గర్గుల్‌ ప్రాంతంలో బండరాళ్లు పగులగొట్టే కూలీలుగా పని చేస్తున్నారు. వారి వద్ద 50 జిలెటిన్‌ స్టిక్స్‌, 6 డిటోనేటర్లు, 52 మీటర్ల వైరు లభించాయి. పేలుడు పదార్థాలను నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌కు చెందిన వరికుప్పల నర్సింలు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసి గాంధారి మండలంలో బండరాళ్లను పేల్చడానికి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం నందిపేట వెళ్లి నర్సింలు ఇంట్లో సోదాలు చేయగా మరో 20 జిలెటిన్‌ స్టిక్స్‌, 4 డిటోనేటర్లు, ఇతర సామగ్రి లభించాయి.

లైసెన్స్‌దారునుంచి కొనుగోలు చేసి..

ఆలూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన ఒరుసు సాయిమల్లు అనే వ్యక్తి పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు లైసెన్స్‌ కలిగి ఉన్నాడని ఎస్పీ తెలిపారు. అయితే అతడి వద్దనుంచి నర్సింలు నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసి అధిక ధరలకు ఇతరులకు విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. సాయిమల్లు ఇంటిని, రికార్డులను తనిఖీ చేయగా రామారెడ్డి, నందిపేట్‌లలో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు అక్రమంగా విక్రయించినవే అని తేలిందన్నారు. దీంతో రాజు, శేషులాల్‌లతోపాటు వరికుప్పల నర్సింలులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని, మరో నిందితుడు సాయిమల్లు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. కేసును ఛేదించిన కామారెడ్డి రూరల్‌ సీఐ రామన్‌, రామారెడ్డి ఎస్సై రాజశేఖర్‌, మాచారెడ్డి ఎస్సై అనిల్‌, సిబ్బంది మహేందర్‌, సిద్దిరాములులను అభినందించారు. వాహనాల తనిఖీలు జరుగుతున్నప్పుడు నిందితులను గుర్తించడం, పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన హోంగార్డు

కై లాస్‌కు రివార్డును అందించారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

సరఫరా చేస్తున్న ముగ్గురి అరెస్ట్‌.. పరారీలో మరో నిందితుడు

70 జిలెటిన్‌ స్టిక్స్‌, 10 డిటోనేటర్లు, సామగ్రి సీజ్‌

వివరాలు తెలిపిన ఎస్పీ రాజేశ్‌ చంద్ర

పేలుడు పదార్థాలు స్వాఽధీనం1
1/1

పేలుడు పదార్థాలు స్వాఽధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement