బాలికల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
ఖలీల్‌వాడి: బాలికల చదువుపై టీచర్లు ప్రత్యేక దృష్టి సారించాలని, హాస్టల్‌లో వారికి అన్ని రకాల వసతులను కల్పించాలని డీఈవో పార్శి అశోక్ కుమార్ పేర్కొన్నారు. నగరంలోని ఓ హోటళ్లలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సౌజన్యంతో సోమవారం స్పెషల్ ఆఫీసర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని డీఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23 వరకు ఐదు రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. బాలికల హాస్టళ్లలోని కేర్‌టేకర్లకు జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల జెండర్ అండ్ ఈక్విటీ కోఆర్డినేటర్స్ భాగ్యలక్ష్మి, సుకన్య, విజయలక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా రిసోర్స్ పర్సన్ పద్మలత, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్స్, టీజీఎంఎస్ హాస్టల్ కేర్ టేకర్స్ 40 మంది పాల్గొన్నారు.


