మాక్లూర్ పాఠశాల పరిశీలన
మాక్లూర్: మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కో ఆర్డినేటర్ వెంకటేశ్వర్‌రావు, డీఈవో అశోక్ కుమార్‌తో కలిసి సోమవారం పరిశీలించారు. మే నెలలో జరిగే నీట్ పరీక్ష నిర్వహణకు భవనం అనుకూలంగా ఉంటుందా అని ఆరా తీశారు. ప్రతి గదిని పరిశీలించి, కార్పొరేట్ పాఠశాల స్థాయిలో అన్ని సౌకర్యాలు ఉన్నా యని పేర్కొన్నారు. నీట్‌కు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని తెలిపారు. వారి వెంట సమగ్ర శిక్షణ అధికారి శ్రీనివాస్‌రావు, మా క్లూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేవన్న, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రచ్చ మురళి ఉన్నారు.
సుభాష్‌నగర్: జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవే ట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 21న ఉ ద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి క ల్పనాధికారి మధుసూదన్ రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ మేళాకు మ హీంద్రా ఆటోమోటివ్, ఎంఎఫ్‌ఆర్ ప్రైవేట్ లి మిటెడ్ కంపెనీలు నియమకాలు చేపడుతున్నా రని పేర్కొన్నారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్, టెక్నీషియన్, క్వాలిటీ కంట్రోల్, సూపర్‌వైజర్ పోస్టులకు పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, ఏదైనా డిగ్రీ చదివిన వారు అర్హులని తెలిపారు. డిచ్‌పల్లి, నిజామాబాద్‌లో ఉద్యోగాలు ఉన్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు శివాజీనగర్‌లోని ఉపాధి కార్యాలయానికి 21న ఉదయం 10.30 గంటలకు సంబంధిత ధ్రువపత్రాలతో రావా లని పేర్కొన్నారు. వివరాలకు 99594 56793, 70135 80089లలో సంప్రదించాలన్నారు.
ఖలీల్‌వాడి: ఈ నెల 21న ఇంటర్ మొదటి సంవత్సరం, 22న రెండవ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్న ట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకు పరీ క్ష కేంద్రానికి కచ్చితంగా చేరుకోవాలని సూచించారు. ఈ పరీక్షలకు గైర్హాజరైన వారు ఫెయిల్ అయినట్లుగా పరిగణిస్తామని పేర్కొన్నారు. జి ల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, అన్ని రెసిడెన్షియల్ కళాశాలల ప్రిన్సిపాళ్లు విద్యార్థులకు హాల్‌టికె ట్ల పంపిణీ చేయడంతోపాటు విద్యార్థులంద రూ పరీక్షలకు హాజరయ్యేలా సమాచారం అందించాలని ఆదేశించారు. 23న గతంలో పరీక్ష రాయని, ఫెయిల్ అయిన బ్యాక్‌లాగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నైతికత, మానవ వి లువలు పరీక్ష ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామన్నారు. 24న ఉదయం 10 గంటలకు మొదటి సంవత్సరం విద్యార్థులకు పర్యావర ణ విద్య పరీక్ష ఉంటుందని తెలిపారు.
నిజామాబాద్ అర్బన్: పోలీస్ ప్రజావాణికి సోమవారం 33 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా బాధితులు సీపీ సాయిచైతన్యను కలిసి సమస్యలను విన్నవించారు. ఫిర్యాదులను పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను సీపీ ఆదేశించారు.


