ప్రజావాణికి 73 ఫిర్యాదులు
నిజామాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 73 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్‌తోపాటు సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్‌లకు వివరించారు. కాగా, అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరిపి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.


