యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
సుభాష్‌నగర్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని యోగా గురువు ప్రభాకర్ అన్నా రు. మౌని అమావాస్య సందర్భంగా నగరంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న దయానంద్ యో గా సెంటర్‌లో ప్రభాకర్ ఆధ్వర్యంలో యోగా సాధకులు 108 సూర్య నమస్కారాలు చేశారు. ప్రభాకర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న ప్రతి యోగా కేంద్రంలో సూర్య నమస్కారాలు చే యాలని, దీని వల్ల డీ విటమిన్, రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఈనెల 25న రథసప్తమి రోజున అందరూ 108 సూర్య నమస్కారాలు చేసి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.దయానంద్ యోగా కేంద్రం డైరెక్టర్ రాంచందర్, యోగా సాధకులు భూమాగౌడ్, నారా యణ, తోట రాజశేఖర్, శ్రీనివాస్ చారి, సురేశ్‌రెడ్డి, జగదీశ్, మురళీ, లక్ష్మీనారాయణ, గురుపాదం,ప్రభు లింగం తదితరులు పాల్గొన్నారు.
డిచ్‌పల్లి: పంచాయతీ ఎన్నికల్లో తనను సర్పంచ్‌గా గెలిపిస్తే కొత్తగా ఇల్లు నిర్మాణం చేసేవారికి సొంత డబ్బులతో 10 బస్తాల సిమెంట్ అందజేస్తానని దేవనగర్ క్యాంప్ గ్రామ సర్పంచ్ యూసుఫ్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆదివారం గ్రామంలో కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి పది బస్తాల సిమెంటును సర్పంచ్ అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీనివాస్, వార్డుసభ్యులు సునీత, జైనబి, స్వప్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
జక్రాన్‌పల్లి: మండలంలోని పడకల్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో విజేతగా నిలిచిన పడకల్ జట్టు క్రీడాకారులు ఆదివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. హై స్కూల్ నుంచి ప్రారంభమై గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేపట్టారు. పటాకులు కాల్చారు. అనంతరం జీపీ కార్యాలయం వద్ద ప్రజాప్రతినిధులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ లోక స్వప్న, ఉపసర్పంచ్ పురుషోత్తంరెడ్డి, ఏసీబీ ఇన్‌స్పెక్టర్ గడ్డం నాగేశ్, పీఈటీ శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ రిత్విక్, గడ్డం సురేశ్, ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు గంట సుధాకర్, అంకం రాజేందర్, వీడీసీ సభ్యులు రాజేశ్వర్‌గౌడ్, భాస్కర్, సీనియర్ క్రీడాకారులు మల్లికార్జున్, చిన్నయ్య, గుండేటి రాజేశ్, క్రీడాకారులు పాల్గొన్నారు.
అలరించిన భజన
నవీపేట: మండల కేంద్రంలోని భక్త మార్కండేయ మందిరంలో జిల్లా కేంద్రానికి చెందిన భక్త మార్కండేయ దీక్షాపరులు చేసిన భజన భక్తులను ఆకట్టుకుంది. పుష్య అమావాస్య పర్వదినమున బాసర నది స్నానానికి వెళ్తున్న మార్కండేయ స్వాములు మార్గ మధ్యంలోని మార్కండేయ మందిరంలో ఆలపించిన భక్తి పాటలు అలరింపజేశాయి. స్థానిక పద్మశాలి కమిటీ ప్రతినిధులు మార్కండేయ స్వాములకు పండ్లు, పాల సేవను అందించారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం


