అగమ్యగోచరం
సొంత జిల్లాకు రావడం సంతోషంగా ఉంది
భవిష్యత్‌లో అన్ని సౌకర్యాలు
● రెండు నెలలవుతున్నా
జీపీవోలకు అందని వేతనాలు
● సగానికిపైగా గ్రామాల్లో జీపీవోలకు ఆఫీసులు లేవు
గ్రామాల్లో కార్యాలయాలు లేక జీపీవోలు ఎక్క డో ఓ చోట కూర్చుంటున్నారు. గతంలో వీఆర్‌ఏ, వీఆర్‌వోలు గ్రామ చావిడీల నుంచి విధులు నిర్వర్తించేవారు. ప్రస్తుతం సగానికిపైగా (దా దాపు 80శాతం గ్రామాల్లో) క్లస్టర్లలో ఆ కార్యాలయాలు కూడా లేకుండా పోయాయి. కొన్ని చోట్ల ప్రభుత్వ భవనాలు, అద్దె గదుల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. మండలకేంద్రానికి సమీపంలో ఉన్న గ్రామాల అధికారులు తహసీల్ కార్యాలయాల నుంచి విధులు కొనసాగిస్తున్నారు. అలాగే రెండు నెలలుగా జీతా లు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రస్థాయిలో శాఖల మధ్య స మన్వయలోపమో, వివిధ శాఖల్లో ఉన్న వారిని జీపీవోలుగా నియమించడం వంటి సాంకేతిక కారణమో కానీ వేతనాలు అందడం లేదు. ప్ర భుత్వం ప్రత్యేక జీవో ద్వారా కార్యాలయాలు కేటాయించాలని, ఉన్నతాధికారులు స్పందించి జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని జీపీవోలు కోరుతున్నారు.
మోపాల్(నిజామాబాద్‌రూరల్) : రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో భూమి, రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం గ్రామ పాలన అధికారులను రెండు నెలల క్రితం నియమించింది. పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే అధికారులకు కార్యాలయాలు లేకపోవడంతో విధుల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. సగానికిపైగా గ్రామాల్లో పాలనా అధికారులకు సొంత కార్యాలయాలు లేవు. విధుల్లో చేరి రెండు నెలలు కావొస్తున్నా.. ఇంతవరకూ వారికి వేతనాలు అందలేదు. జీపీవోలపై ప్రభుత్వం శ్రద్ధ చూపి కార్యాలయాల ఏర్పాటుతోపాటు ప్రతినెలా జీతాలు చెల్లించడం, ఇతర సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వారు కోరుతున్నారు.
జిల్లాలో 453 రెవెన్యూ క్లస్టర్లు ఉండగా 300 మంది గ్రామ పాలనా అధికారులను ప్రభుత్వం నియమించింది. మాజీ వీఆర్వోలు, అర్హులైన వీఆర్‌ఏలకు పరీక్ష నిర్వహించి జీపీవోలుగా అవకాశం కల్పించింది. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, వీఆర్‌ఏలు, వీఆర్‌వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన విషయంతెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీమేరకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అర్హత, ప్రవేశపరీక్షలో మెరిట్ సాధించిన వారిని జీపీవోలుగా నియమించింది. ఖాళీగా ఉన్న 153 క్లస్టర్లకు కూడా త్వరలోనే పరీక్ష నిర్వహించి భర్తీ చేయనున్నట్లు తెలిసింది.
వివిధ జిల్లాల్లో పలు శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, వార్డు ఆఫీసర్, రికార్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న మమ్ముల్ని సొంత జిల్లాలో జీపీవోలుగా నియమించడం ఆనందంగా ఉంది. సొంత కార్యాలయాలు లేకపోవడంతో ప్రభుత్వ భవనాల నుంచి విధులు చేపడుతున్నాం. సాంకేతిక సమస్య కారణంగా జీతాలు జమ కాలేదని ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది.
– గున్నం సంతోష్, జీపీవో, ముదక్‌పల్లి
గ్రామ పాలన అధికారులను నియమించి రెండు నెలలు గడిచింది. వారికి భవిష్యత్‌లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. సొంత కార్యాలయాలతోపాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తాం. త్వరలోనే వారి జీతాలు జమవుతాయి. ఖాళీగా ఉన్న క్లస్టర్ల జీపీవోల నియామకాలను ప్రభుత్వం త్వరలోనే చేపడుతుంది.
– కిరణ్‌కుమార్, అదనపు కలెక్టర్
అగమ్యగోచరం
అగమ్యగోచరం


