వైద్యుల వక్రబుద్ధి!
నిజామాబాద్‌అర్బన్ : ప్రాణదాతలుగా సమాజంలో గౌరవంగా సేవలందించాల్సి న పలువురు వైద్యులు తమ పనుల కారణంగా తలదించుకుంటున్నారు. కొంత మంది కారణంగా వృత్తి కే కళంకం వస్తోందని తోటి వైద్యులు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల లైంగిక వేధింపుల కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తనను ఓ దంత వైద్యుడితోపాటు రియల్టర్ లైంగికంగా వేధిస్తున్నారని ఇటీవ ల ఓ మహిళ నాల్గో టౌన్ పోలీసుల కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన నగరంలో క లకలం సృష్టించింది. దీంతో మరికొంత మంది వైద్యుల వ్యవహారంపై సర్వత్రా చర్చసాగుతోంది.
● రాజీవ్ గాంధీ ఆడిటోరియం సమీపంలోని డయాబెటిస్ వైద్యుడి వద్దకు నగరానికి సమీపంలోని మేజర్ గ్రామానికి చెందిన యువతి తన తల్లితోపాటు వచ్చింది. తన తల్లికి డయాబెటిస్ ఉందని సదరు వైద్యుడిని సంప్రదించింది. ఈ క్రమంలో యువతిని మాటల్లోకి దింపిన డాక్టర్ ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని రాత్రివేళ అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించాడు. యువతి వెంటనే కుటుంబ సభ్యులకు తెలుపగా వారు డాక్టర్ వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారు. అనంతరం ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ డాక్టర్ మరోసారి తప్పు చేయనని చెప్పి సయోధ్యకుదుర్చుకున్నాడు. ఇదే వైద్యుడు అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన మరో మహిళను రక్త పరీక్షలు నిర్వహించాలంటూ గంటల తరబడి ఆస్పత్రిలో ఉంచి, తన గదిలో అసభ్యకరంగా తాకుతూ ఇబ్బందులకు గురి చేశాడనే ఆరోపణలున్నాయి. అలాగే ఆర్మూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ సెల్‌ఫోన్ నంబర్ తీసుకుని వైధింపులకు పాల్పడగా ఆమె సోదరుడు వచ్చి వైద్యుడిని హెచ్చరించినట్లు తెలిసింది.
● మరో పిల్లల వైద్యుడు కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరు స్టాఫ్‌నర్సులను వేధించగా వారు అతని ఫోన్ కాల్ రికార్డులను చూపించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అనడంతో వెనక్కి తగ్గినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తన శిశువును చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లాలోని ఓ తండాకు చెందిన మహిళ తీసుకురాగా ఆమెను అసభ్యకరంగా తాకడంతో ఆమె అక్కడే ఉన్న తన భర్తకు విషయం తెలిపింది. ఆమె భర్త సదరు వైద్యుడికి దేహశుద్ధి చేయగా విషయం బయటికి రాకుండా జాగ్రత్తపడ్డారు. అదే ఆస్పత్రిలో పనిచేసే మరో మహిళను ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికి సినిమాలకు షికార్లకు తీసుకెళ్లగా విషయం తెలుసుకున్న వైద్యుడి భార్య అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్యకు క్షమాపణ చెప్పి చివరకు కేసునుంచి తప్పించుకున్నాడు. తన ఆస్పత్రిలో పనిచేసే సిబ్బందిని హైదరాబాద్ తదితర ప్రాంతాలకు టూర్ల పేరిట తీసుకెళ్తూ లైంగికంగా వేధిస్తున్నట్లు ఆ వైద్యుడిపై ఆరోపణలున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలను మాత్రమే ఉద్యోగంలో కొనసాగిస్తాడని ఆ డాక్టర్‌కు పేరుంది.
● దీర్ఘకాలిక రోగాల వైద్య నిపుణుడిగా సేవలందిస్తున్న ఓ డాక్టర్ మహిళలను వేధిస్తున్నట్లు తెలియడంతో తోటి వైద్యులు హెచ్చరించగా వివాదం జరిగింది.
వైద్యం కోసం వచ్చే వారికి
లైంగిక వేధింపులు
ఆస్పత్రుల్లో స్టాఫ్‌నూ వదలని వైనం
పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు
ఇప్పటికే వెలుగులోకి పలు ఘటనలు
వైద్యుల వక్రబుద్ధి!


