నూతన పింఛన్‌లకు మోక్షమెన్నడో? | - | Sakshi
Sakshi News home page

నూతన పింఛన్‌లకు మోక్షమెన్నడో?

Nov 11 2025 7:07 AM | Updated on Nov 11 2025 7:07 AM

నూతన

నూతన పింఛన్‌లకు మోక్షమెన్నడో?

స్పౌస్‌ పింఛన్‌లకు మాత్రమే..

మోర్తాడ్‌(బాల్కొండ) : ఎంతో మంది వితంతులు, వృద్ధులు, ది వ్యాంగులు కొత్త పింఛన్‌లు మంజూరుకాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వృద్ధులు, వితంతులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు ప్రతి నెలా రూ.2,016, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున పింఛన్‌ అందుతుండగా ఆ మొత్తాన్ని పెంచు తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ప్రకటించింది. పింఛన్‌ మొత్తం పెరగకపోగా, కొత్తవి మంజూరుకావడం లేదు. జిల్లా వ్యాప్తంగా 2.69 లక్షల మంది లబ్ధిదారులకు వివిధ రకాల పింఛన్‌లు అందుతుండగా, కొత్త వా టి కోసం 50వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

చనిపోయిన వారి స్థానంలోనే..

ప్రస్తుతం పింఛన్‌ పొందుతున్న లబ్ధిదారు మరణిస్తే ఆ స్థానంలో కుటుంబ సభ్యులకు మాత్రమే కొత్త పింఛన్‌ మంజూరవుతోంది.

భార్య చనిపోతే భర్తకు, భర్త చనిపోతే భార్యకు మాత్రమే పింఛన్‌ మంజూరు చేస్తున్నారు. కొత్త పింఛన్‌ల మంజూరును ప్రభుత్వం పక్కన పెట్టిందనే విమర్శలున్నాయి.

దివ్యాంగులకు తప్పని కష్టాలు

అనుకోని పరిస్థితుల్లో దివ్యాంగులైన వారికి నూతన పింఛన్‌ మంజూరు కావాలంటే పరిస్థితి క్లిష్టంగా మారింది. 60శాతానికిపైగా వైకల్యం ఉన్నట్లు సదరం క్యాంపుల ద్వారా సర్టిఫికెట్‌ పొందిన వారికి పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) రాష్ట్ర కార్యాలయం నుంచి ఆమోదం లభిస్తేనే కొత్త పింఛన్‌ మంజూరవుతోంది. దివ్యాంగుల్లో అనేక మందికి సదరం సర్టిఫికెట్‌లు ఉన్నా కొత్త పింఛన్‌ల మంజూరుకు ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అర్హులకు నూతన పింఛన్‌లు మంజూరు చేయాలంటున్నారు.

స్పౌస్‌ పింఛన్‌లకు మాత్రమే అవకాశం ఉంది. పింఛన్‌ పొందుతున్న భార్య చనిపోతే భర్తకు, భర్త చనిపోతే భార్యకు మాత్రమే కొత్త పింఛన్‌ మంజూరవుతోంది. దివ్యాంగులకు సెర్ప్‌ కార్యాలయం అనుమతి ఇస్తేనే కొత్త పింఛన్‌ మంజూరవుతుంది. ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తేనే కొత్త వారికి పింఛన్‌లు అందుతాయి.

– గంగుల సంతోష్‌కుమార్‌, ఎంపీడీవో, భీమ్‌గల్‌

2022లో నిలిచిన

కొత్త పింఛన్‌ల ప్రక్రియ

లబ్ధిదారు మరణిస్తే వారిపై

ఆధారపడిన వారికి మాత్రమే మంజూరు

తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న

దరఖాస్తుదారులు

మోర్తాడ్‌ మండలం సుంకెట్‌కు చెందిన ర మ్య భర్త గంగాధర్‌ తీ వ్ర అనారోగ్యంతో మూ డేళ్ల క్రితం మరణించా డు. దినసరి వ్యవసాయ కూలీ అయిన ఆమె.. వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుని రెండున్నరేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. ఈ సమస్య

రమ్య ఒక్కరే ఎదుర్కొంటున్నది కాదు.

నూతన పింఛన్‌లకు మోక్షమెన్నడో?1
1/1

నూతన పింఛన్‌లకు మోక్షమెన్నడో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement