ఇందూరుతో అందెశ్రీకి ఆత్మబంధం
నిజామాబాద్ రూరల్ : పొట్ట చేత పట్టుకుని జిల్లాకు వచ్చిన అందెశ్రీ (ఎల్లన్న) జిల్లాలోని పలు గ్రామా ల్లో గొర్రెల కాపరిగా, వ్యవసాయ కూలీగా, తాపీమేస్త్రిగా పని చేశారు. జిల్లాతో ఆత్మబంధం కలిగి ఉన్న ఆయన నిజామాబాద్‌ను తన రెండో జన్మభూమిగా భావించారు. మాక్లూర్ మండలం అమ్రాద్ లోని సరస్వతిమాత ఆలయంలో శంకర్‌మహరాజ్ వద్ద ఆశ్రయం పొందుతూ అమ్రాద్, తల్వేద గ్రామా ల్లో తాపీమేస్త్రిగా పని చేశారని, 1990లో ఆర్మూర్ మండలం మచ్చర్లలో గొర్రెలకాపరిగా, వ్యవసాయకూలీగా, తాపీమేస్త్రిగా పని చేశారని ఆయా గ్రామా ల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. పనిచేసే చోట్ల తన పాటలు, పద్యాలతో ఉత్సాహపరిచేవారని తెలిపారు. కందకుర్తి, బాసర, పోచంపాడ్‌ల వద్ద ఆయన గోదావరి తీరంలో తిరుగుతూ ఆశువుగా పాటలు అల్లారని, ఈ మట్టితో అనుబంధం కలిగిన అందెశ్రీ.. తాను బాసర సరస్వతీమాత ఆశీస్సులతో సహజ కవిగా ఎదిగానని చెప్పేవారని పేర్కొన్నారు. ఆ తరువాత హృదాయాలను కదిలించే, ఉద్యమాన్ని రగిలించే పాటలతో అందెశ్రీ సాహిత్య ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని పదిలపర్చుకున్నారు. ‘కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా..’ అంటూ హృదయాలను కదిలించారు. ‘జై బోలో తెలంగాణ గళ గర్జనల జడివాన..’ అంటూ ప్రత్యేక తెలంగాణ కోసం పిడికిలి బిగించి ముందుకు సాగేలా ఉత్సాహపరిచారు. ఎన్నో పోరాటాల తరువాత ఏర్పాటైన తెలంగాణకు రాష్ట్రగీతం ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’ అందించారు. కవిగా, రచయితగా ఉ న్నత శిఖరాలకు చేరిన ఆయన.. తనకు అన్నం పెట్టి న జిల్లాగా చెప్పుకునే నిజామాబాద్‌ను ఏనాడూ మరువలేదు. తాను రచించిన ‘జయజయహే తె లంగాణ’ను ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డిలో ఉద్య మ వేదికపై తొలిసారి ఆలపించారు. తరువాత ఆ గీతమే రాష్ట్ర గీతమైంది. ఉద్యమ కాలంలో జిల్లాకు అనేకసారు వచ్చారు. 2011లో హరిదా రచయితల సంఘం లోగో ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు.
కవులు, రచయితలతో అనుబంధం
జిల్లాకు చెందిన కవులు, రచయితలు ఘనపురం దేవేందర్, నరాల సుధాకర్, శిక నరసింహస్వామి, గుత్ప ప్రసాద్, డాక్టర్ బలాష్ట్ మల్లేశ్, అంబట్ల రవి, కత్తి గంగాధర్, సాంబయ్య, డాక్టర్ కంటియాల ప్రసాద్, సీహెచ్ మధు, అనిశెట్టి శంకర్, తుర్లపాటి లక్ష్మి, కాసర్ల నరేశ్, ఆనంద్ మేకల్‌వార్, తిరుమల శ్రీనివాస్ ఆర్య, సురేశ్ తంగళ్ళపల్లితోపాటు ప్రస్తుత ఎమ్మెల్యే, నాటి ఉద్యమకా రు డు ధన్‌పాల్ సూర్యనారాయ ణ ఇలా ఎందరితోనే అందెశ్రీకి అనుబంధం ఉంది. హైదరా బాద్‌లో అందెశ్రీ పార్థివదేహా నికి జిల్లాకు చెందిన పలువురు నివాళులర్పిం చారు.
నిజామాబాద్‌ను తన రెండో జన్మభూమిగా భావించిన కవి
మాక్లూర్ మండలం అమ్రాద్‌లో
శంకర్ మహరాజ్ వద్ద ఆశ్రయం
గొర్రెల కాపరిగా, వ్యవసాయ కూలీగా, తాపీమేస్త్రిగా పని..
నివాళులర్పించిన జిల్లావాసులు
ఇందూరుతో అందెశ్రీకి ఆత్మబంధం


